Skip to content

‘యుఫోరియా’ చిత్రాన్ని ప్రేక్ష‌కులంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా ఆహ్లాదక‌రంగా చ‌క్క‌టి మెసేజ్‌తో తెర‌కెక్కించాం: డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌

వినూత్న కథలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న గుణ శేఖర్ రూపొందిస్తోన్న యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘యుఫోరియా’. సమకాలీన అంశాలతో , లేట్ నైట్ కల్చర్, డ్రగ్స్, యువత అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని గుణ శేఖర్ తెరకెక్కిస్తున్నారు. రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోన్న ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన గ్లింప్స్‌, ఫ్లై హై సాంగ్‌తో మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. శ‌నివారం రోజున ఈ మూవీ నుంచి ‘రామ రామ..’ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో భూమిక‌, విఘ్నేష్ గ‌విరెడ్డి, రోహిత్‌, డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌, నీలిమ గుణ, ఎడిట‌ర్ ప్ర‌వీణ్ పూడి, ఆదిత్య మ్యూజిక్ మాధ‌వ్‌, మాస్ట‌ర్‌ ఆరుష్‌, యానీ మాస్ట‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా…

చిత్ర ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ మాట్లాడుతూ ‘‘నాతో పాటు రాగిణి, నీలిమ, యుక్త కలిసి ‘యుఫోరియా’ సినిమాను తీశారు. కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమాను తెర‌కెక్కించాం. అంద‌రూ క‌నెక్ట్ అయ్యేలా ఆహ్లాదక‌రంగా చ‌క్క‌టి మెసేజ్‌తో సినిమాను తెర‌కెక్కించాం. ఫ్లై హై అనే పాట‌తో అంద‌రినీ మెప్పించిన కాల భైర‌వ ఇప్పుడు రామ రామ అనే సాంగ్‌తో మ‌న ముందుకు వ‌చ్చారు. చైత‌న్య ప్ర‌సాద్ ఈ పాట‌కు మంచి సాహిత్యాన్ని అందించారు. అంద‌రూ ఎంజాయ్ చేసేలా పాట ఉంటుంది. ప్ర‌వీణ్ పూడి వంటి టెక్నీషియ‌న్‌తో వ‌ర్క్ చేయ‌టం హ్య‌పీ. ప్ర‌వీణ్ కె.పోత‌న్ అనే సినిమాటోగ్రాఫ‌ర్‌ను ఈ సినిమాతో ప‌రిచ‌యం చేస్తున్నాను. ఇందులో దాదాపు 20 మంది కొత్త వారిని ప‌రిచ‌యం చేశాను. ఇందులో విఘ్నేష్ గ‌విరెడ్డి క‌థానాయ‌కుడిగా క‌నిపించ‌బోతున్నాడు. త‌ను మ‌న‌సు పెట్టి న‌టించాడు. అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. రోహిత్‌గారు ఈ సినిమాలో చాలా చ‌క్క‌గా న‌టించారు. చాలా రోజుల‌ త‌ర్వాత భూమిక మా సినిమా ద్వారా…చాలా మంచి పాత్ర‌లో రీ ఎంట్రీ ఇచ్చారు’’ అన్నారు.

న‌టి భూమిక మాట్లాడుతూ ‘‘‘యుఫోరియా’ నా హృద‌యానికి ఎంతో ద‌గ్గ‌రైన సినిమా. నాకు ప‌ద‌కొండేళ్ల కొడుకున్నాడు. విఘ్నేష్‌తో ఎక్కువ‌గా సెట్స్ లో ఉన్న‌ప్పుడు మా అబ్బాయితో ఉన్న‌ట్లే అనిపించింది. త‌ను ఎంతో గొప్ప‌గా న‌టించాడు. ఆ మూవీ నుంచి విడుద‌లైన రామ రామ సాంగ్ ఎంతో న‌చ్చింది. కాల భైర‌వ మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా మ‌న‌పై ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుంద‌ని న‌మ్ముతున్నాను. తల్లిదండ్రులు త‌ప్ప‌కుండా చూడాల్సిన సినిమా’’ అన్నారు.
ఎడిట‌ర్ ప్ర‌వీణ్ పూడి మాట్లాడుతూ ‘‘‘యుఫోరియా’ నుంచి ‘రామ రామ‌’ సాంగ్ రిలీజ్ కావ‌టం చాలా ఆనందంగా ఉంది. గుణ శేఖ‌ర్‌గారు తెర‌కెక్కించిన చూడాల‌ని ఉంది సినిమాకు నేను అసిస్టెంట్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేశాను. అప్పుడు ఆయ‌న్ని ఎలాగైతే చూశానో, ఇప్ప‌టికీ అలాగే ఉన్నారు. త‌న సినిమాల ద్వారా సోసైటీకి ఏదైనా చెప్పాల‌ని అనుకుంటారు. అలాంటి వ్య‌క్తులు ఈ సోసైటీకి ఎంతో అవ‌స‌రం. చాలా గ్యాప్ త‌ర్వాత భూమిక‌గారు తెలుగులో న‌టించారు. యుఫోరియా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులను ఆవిష్క‌రిస్తుంది. అంద‌రూ చూడాల్సిన సినిమా ఇది. త‌ల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. చాలా మంది కొత్త వాళ్ల‌ను ఈ సినిమా ద్వారా గుణ‌శేఖ‌ర్‌గారు ప‌రిచ‌యం చేస్తున్నారు. అంద‌రూ ఎంక‌రేజ్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నిర్మాత నీలిమ గుణ మాట్లాడుతూ ‘‘‘యుఫోరియా’ నుంచి రిలీజైన రామ రామ సాంగ్ చూస్తుంటే నాకు ఒక్క‌డు సినిమాలో చెప్ప‌వే చిరుగాలి సాంగ్‌లో ఆమెను చూసిన‌ట్లే అనిపించింది. ఆమె ఈ సినిమాలో న‌టించ‌టం ఎంతో గొప్ప‌గా భావిస్తున్నాం. ఈ సినిమాతో ఆమె క్యూట్ మామ్‌గా పేరు తెచ్చుకుంటారు. కాల భైర‌వ‌గారు బ్యూటీఫుల్ మ్యూజిక్ అందించారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

యాక్ట‌ర్ విఘ్నేష్ మాట్లాడుతూ ‘‘‘యుఫోరియా’ అందరూ చూడాల్సిన సినిమా. ప్రేక్ష‌కుల స‌మ‌యానికి, డ‌బ్బుకి విలువిచ్చి చేసిన సినిమా. భూమిక‌గారు నాకెంతో కంఫర్ట్ ఇచ్చారు. ఆమెకు ఈ సంద‌ర్భంగా థాంక్స్ చెబుతున్నాను. ఇందులో నేను ఆమె కొడుకు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాను. నాతో పాటు కొత్త ఆర్టిస్టుల‌ను, టెక్నీషియ‌న్స్‌ను ప‌రిచ‌యం చేసినందుకు గుణ‌శేఖ‌ర్‌గారికి ఈ సంద‌ర్భంగా థాంక్స్ చెబుతున్నాను. నిజాయ‌తీగా చేసిన సినిమా ఇది. అంద‌రూ స‌పోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

రోహిత్ మాట్లాడుతూ ‘‘‘యుఫోరియా’ సినిమా మ‌న అంద‌రి కోసం చేసిన సినిమా. గుణ‌శేఖ‌ర్‌గారు ఇప్ప‌టి జ‌న‌రేష‌న్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా చేశారు. మంచి ఆలోచ‌న‌ను క‌లిగించే సినిమా అవుతుంది. విఘ్నేష్ డెబ్యూ సినిమా అయిన‌ప్ప‌టికీ చ‌క్క‌గా న‌టించాడు. భూమిక‌గారితో క‌లిసి ప‌నిచేయటం మెమ‌ర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌. గుణ‌శేఖ‌ర్‌గారు ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్‌గా సినిమాను తెర‌కెక్కించారు. ఆయ‌న ద‌ర్శ‌కత్వంలో సినిమా చేయ‌టాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ప్ర‌తీ క్యారెక్ట‌ర్ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’’ అన్నారు.

విఘ్నేష్ గవిరెడ్డి ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కానుండగా.. ప్రముఖ నటి భూమిక చావ్లా కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచిలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

గుణ హ్యాండ్‌మేడ్ ఫిల్మ్స్ పతాకంపై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాగిణి గుణ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కె పోతన్ సినిమాటోగ్రఫర్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.