హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ సంజయ్ మహా న్యూస్ రిపోర్టర్ మరియు యాంకర్ గా…
విజయవాడలో తొలి U&i రిటైల్ స్టోర్‌ను ప్రారంభించిన సినీ తార నభా నటేష్..

– దేశంలోని ప్రధాన నగరాల్లో బ్రాండ్ విస్తరణలో భాగంగా ప్రత్యేక స్టోర్…
–
– అత్యాధునిక ఆడియో సొల్యూషన్స్ మొదలు అధునాతన బ్యాటరీ, మొబైల్ యాక్సెసరీస్ వరకు అందుబాటులో…
విజయవాడ, 20 ఆగస్టు 2025: భారతదేశంలోని ప్రముఖ గాడ్జెట్, యాక్ససరీస్, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయినటువంటి U&i మొట్టమొదటి ప్రత్యేకమైన రిటైల్ స్టోర్‌ను విజయవాడలోని ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్, గవర్నర్ పెట్ లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు నటి నభా నటేష్ ముఖ్య అతిథిగా హాజరై U&i స్టోర్ ను ప్రారంభించారు. ఇందులో సంస్థ డైరెక్టర్ శ్రీ పరేష్ విజ్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 150కి పైగా ప్రత్యేక స్టోర్‌లతో తమ విస్తృత శ్రేణి ఉత్పత్తులను, ఆడియో పరికరాలు, బ్యాటరీ, మొబైల్ యాక్సెసరీస్, లైఫ్ స్టైల్ గాడ్జెట్‌లను అందిస్తున్న U&i ఆంధ్రప్రదేశ్‌లోని కస్టమర్‌లకు కూడా ఈ సేవలు అందిస్తూ తన ప్రశస్తిని మరింత బలోపేతం చేస్తోంది. విజయవాడలోని ఔట్‌లెట్.. బ్రాండ్ యొక్క నూతన ఆవిష్కరణలను, బ్రాండ్ బెస్ట్ సెల్లింగ్ ఉత్పత్తులను ఒకే వేదికలోకి తీసుకువస్తుంది.
ఈ సందర్భంగా U&i డైరెక్టర్ శ్రీ పరేష్ విజ్ మాట్లాడుతూ.., “మా మొట్టమొదటి ప్రత్యేక స్టోర్‌ను విజయవాడకు తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రారంభం మా రిటైల్ విస్తరణ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది, అంతేకాకుండా భారతదేశం అంతటా మేము పొందుతున్న ఆదరణ, ప్రోత్సాహం ఇక్కడి వినియోగదారులు కొనసాగిస్తారని, U&i ఉత్పత్తులను స్వీకరిస్తారని మేము విశ్వసిస్తున్నాము” అని తెలిపారు.
U&i రిటైల్ భాగస్వామి శ్రీ జశ్వంత్ మాలి మరియు శ్రీ ప్రకాష్ మాలి యాజమాన్యంలోని విజయవాడ స్టోర్.., బ్రాండ్ యొక్క రిటైల్ విస్తరణలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. స్థానిక మార్కెట్లో వారి నైపుణ్యం బ్రాండ్ యొక్క ఉనికిని మరింత ఉన్నతంగా నడిపిస్తుందని, ఈ ప్రాంతంలోని కస్టమర్లతో బలమైన సంబంధాన్ని ఏర్పరుస్తున్నాయని భావిస్తున్నారు.
విజయవాడలోని ఈ నూతన ప్రత్యేక స్టోర్ దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ దుకాణాల ద్వారా దాని లైవ్-కస్టమర్ సేవలను బలోపేతం చేయాలనే U&i సంస్థ నిబద్ధత, శాశ్వత దృక్పథంలో భాగం. వినియోగదారులు ఇప్పుడు స్టోర్ ను సందర్శించి ఉత్పత్తులను ప్రత్యక్షంగా ఎంపిక చేసుకోవచ్చు. ఈ వేదికగా బ్రాండ్ యొక్క శిక్షణ పొందిన సిబ్బంది, నిపుణుల మార్గనిర్దేశంతో, వారందించే సమాచారంతో అనువైన ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేయవచ్చు.
U&i గురించి:
U&i 2019లో ప్రారంభించబడింది… అప్పటి నుండి ఇది లైఫ్ స్టైల్ టెక్నాలజీలో అతి తొందరగా కష్టమర్లకు విశ్వసనీయ బ్రాండ్ గా పేరుగాంచింది. ఈ బ్రాండ్ దృష్టి ఎల్లప్పుడూ ఆవిష్కరణ, డిజైన్ తో పాటు అధిక-నాణ్యత ఉత్పత్తులను అందించడంపై కేంద్రీకరిస్తుంది. ఈ ఉత్పత్తులు అద్భుతంగా పనిచేయడమే కాకుండా వారి కస్టమర్ల జీవనశైలికి అనుగుణంగా ఉండటం వీటి ప్రత్యేకత. అత్యాధునిక ఆడియో సొల్యూషన్స్ మొదలు అధునాతన పవర్ యాక్సెసరీస్ వరకు… U&i టెక్ యాక్సెసరీస్ ఏమేమి అందించగలవో పునర్నిర్వచించుకుంటోంది. వారి వినియోగదారులకు సజావుగా, ఆధునిక అనుభవాలను అందిస్తోంది.