Skip to content

‘అర్జున్ చక్రవర్తి’ థియేటర్స్ లో చూడాల్సిన సినిమా: డైరెక్టర్ విక్రాంత్ రుద్ర

విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి అద్భుతమైన స్పందనను పొందింది. సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.

థాంక్ యూ మీట్లో డైరెక్టర్ విక్రాంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమా చూసిన ఆడియన్స్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. చాలా గ్రేట్ ఫిల్మ్ అంటున్నారు. ప్రేక్షకుల రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇంకా చాలామంది సినిమా చూడలేదు. తప్పకుండా ఈ సినిమా చూడాలని, మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మీ అందరూ ప్రోత్సహిస్తేనే, ప్రేక్షకులు ఆదరిస్తేనే మా అందరికీ మరో సినిమా తీయడానికి ప్రోత్సాహం దొరుకుతుంది. ప్రేక్షకులు సినిమాని ఆదరించి కలెక్షన్స్ ఇవ్వగలిగితేనే ఇలాంటి మంచి సినిమాలు మీ ముందుకు వస్తాయి .సినిమాకి అద్భుతమైన రివ్యూస్ ఇచ్చిన మీడియా వారందరికీ ధన్యవాదాలు. మా నిర్మాత శ్రీని గారు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. ఎక్కడ రాజీ పడకుండా సినిమాలు తీశారు. మా టీం లేకపోతే ఈ సినిమా ముందుకు వచ్చేది కాదు. టీంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా మా హీరో గురించి, మా నిర్మాత గురించి చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారు. విజయ్ ఆరేళ్లపాటు ఈ సినిమా