రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్…
ఆద్యంతం ఆకట్టుకునేలా ఫన్, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బన్ బటర్ జామ్’ ట్రైలర్.. ఆగస్ట్ 22న మూవీ గ్రాండ్ రిలీజ్

రాజు జెయమోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ హీరో హీరోయిన్లుగా రాఘవ్ మిర్‌దత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బన్ బటర్ జామ్’. సురేష్ సుబ్రమణియన్ సమర్పకుడిగా రెయిన్ ఆఫ్ ఎరోస్, సురేష్ సుబ్రమణియన్ నిర్మించిన ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బన్ బటర్ జామ్’ ఔట్ అండ్ ఔట్ కామెడీగా తమిళ్‌లో సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీని తెలుగులో ఆగస్టు 22న శ్రీ విఘ్నేశ్వర ఎంటైన్మెంట్స్ బ్యానర్ పైన సిహెచ్ సతీష్ కుమార్ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
‘సంపాదించిన దాంట్లో సగం పెళ్లికి ఖర్చు పెడుతున్నారు.. మిగతా సగం డైవర్స్‌కి ఖర్చు పెడుతున్నారు’, ‘అసలు నేను చేస్తోంది లవ్వో కాదో తెలియట్లేదే’, ‘ఏ రిలేషన్ షిప్‌లో అయినా రెండు వైపుల ప్రేమ, మర్యాద సమానంగా ఉండాలి’.. ‘మీరు రాను రాను పిచ్చి వాళ్లలా బిహేవ్ చేస్తున్నారు’.. ‘అవునురా మేమంతా పిచ్చివాళ్లమే.. మీ లైఫ్ అంతా బాగుండాలని అనుకుంటున్నాం కదా’ అని తల్లీకొడుకుల మధ్య సంభాషణ.. ట్రైలర్ చివర్లో వచ్చే ‘ఇష్టమైతే పెళ్లి చేసుకుంటున్నారు. లేకపోతే డైవర్స్ తీసుకుంటున్నారు.. మీ జనరేషన్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం ఓడిపోతున్నాం’ అంటూ తల్లి చెప్పే డైలాగ్‌ను బట్టి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉండబోతోన్నాయో అర్థం అవుతోంది.
కాలేజ్ లైఫ్, ప్రేమ, పెళ్లి, తల్లిదండ్రుల ప్రేమ ఇలా అన్ని రకాల అంశాల్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించినట్టుగా అర్థం అవుతోంది. ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే ఇది యూత్ ఫుల్, లవ్, ఫ్యామిలీ, రొమాంటిక్, కామెడీ సినిమా అని తెలుస్తోంది. రాఘవ్ మిర్‌దత్ ఫన్నీగా సినిమాను తెరకెక్కించిన తీరు, నివాస్ కె.ప్రసన్న సంగీతం, బాబు కుమార్ సినిమాటోగ్రఫీతో పాటు ప్రొడక్షన్ వేల్యూస్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఆగస్ట్ 22న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సి.హెచ్.సతీష్ కుమార్ విడుదల చేస్తున్నారు.
నటీనటులు:
రాజు జెయమోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ, చార్లి, శరణ్య పొన్‌వన్నన్, దేవదర్శిన, మైకేల్ తంగదురై, విజె.పప్పు తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: రాఘవ్ మిర్‌దత్, నిర్మాతలు: రెయిన్ ఆఫ్ ఎరోస్, సురేష్ సుబ్రమణియన్, సంగీతం: నివాస్ కె.ప్రసన్న, సినిమాటోగ్రఫీ: బాబు కుమార్, ఎడిటర్: జాన్ అబ్రహం, వి.ఎఫ్.ఎక్స్ ప్రొడ్యూసర్: స్టాలిన్ శరవణన్, ఆర్ట్: శశికుమార్, ప్రాజెక్ట్ డిజైనర్: సతీష్ కె, కొరియోగ్రఫీ: బాబి, స్టంట్: ఓం ప్రకాష్, సౌండ్ డిజైన్: సింక్ సినిమా, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.జె.భారతి, పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్రకుమార్, ఫణి కందుకూరి (బియాండ్ మీడియా).