రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్…
ఈ నెల 16న “ది గర్ల్ ఫ్రెండ్” నుంచి ‘నదివే…’ లిరికల్ సాంగ్ రిలీజ్

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.
ఈ రోజు “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా నుంచి ‘నదివే…’ లిరికల్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పాటను ఈ నెల 16వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘నదివే…’ పాటను బ్యూటిఫుల్ మెలొడీగా కంపోజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్. చిత్రీకరణ తుది దశలో ఉన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.
నటీనటులు – రశ్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, తదితరులు
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – కృష్ణన్ వసంత్
సంగీతం – హేషమ్ అబ్దుల్ వాహబ్
కాస్ట్యూమ్స్ – శ్రావ్య వర్మ
ప్రొడక్షన్ డిజైన్ – ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి
పీఆర్ఓ – జి.ఎస్.కే మీడియా,వంశీ కాక
మార్కెటింగ్ – ఫస్ట్ షో
సమర్పణ – అల్లు అరవింద్
బ్యానర్స్ – గీతా ఆర్ట్స్,ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు – ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి
రచన -దర్శకత్వం – రాహుల్ రవీంద్రన్