Skip to content

కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న “తమ్ముడు” చిత్రాన్ని థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు, ఈ జానర్ లో “తమ్ముడు” మూవీని ఒక రిఫరెన్స్ గా చెప్పుకుంటారు – ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు

కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న “తమ్ముడు” చిత్రాన్ని థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు, ఈ జానర్ లో “తమ్ముడు” మూవీని ఒక రిఫరెన్స్ గా చెప్పుకుంటారు – ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ “తమ్ముడు”. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న “తమ్ముడు” సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లో ఘనంగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో

ఎడిటర్ ప్రవీణ్ పూడి మాట్లాడుతూ – దిల్ రాజు గారి బ్యానర్ లో అద్భుతమైన చిత్రాలకు పనిచేసే అవకాశం లభించింది. తమ్ముడు చిత్రాన్ని శ్రీరామ్ వేణు గారు చాలా కొత్తగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. హీరో నితిన్, ఇతర నటీనటుల పర్ ఫార్మెన్స్ చాలా బాగుంది. తమ్ముడు సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ మాట్లాడుతూ – శ్రీరామ్ వేణుతో ఎంసీఏ, వకీల్ సాబ్ మూవీస్ కు వర్క్ చేశాను. తమ్ముడు మూవీ ఒక సర్ ప్రైజింగ్ ఫిల్మ్. శ్రీరామ్ వేణు ఒక సర్ ప్రైజింగ్ సబ్జెక్ట్ ను మీకు చూపించబోతున్నాడు. ట్రైలర్ మీకు నచ్చిందని భావిస్తున్నా. తమ్ముడు సినిమా ప్రేక్షకులందరికీ రీచ్ కావాలి. అన్నారు.

బేబి దిత్య మాట్లాడుతూ – ఈ మూవీలో నా క్యారెక్టర్ పేరు దిత్య. సెట్ లో వీళ్లందరితో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ నన్ను బాగా చూసుకున్నారు. బాగా చూసుకోవడం అంటే చాక్లెట్స్ ఇవ్వడం కాదు. నాతో మాట్లాడటం, ఆడుకోవడం చేశారు. నితిన్ గారు ఫన్ గా ఉండేవారు. అన్నారు

హీరోయిన్ సప్తమి గౌడ మాట్లాడుతూ – తమ్ముడు మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ చిత్రంలో ఫస్ట్ కాస్టింగ్ చేసింది నన్నే. తమ్ముడు మూవీలో రత్న అనే క్యారెక్టర్ చేశాను. నితిన్, లయ, వర్ష, స్వసిక..ఇలా వీళ్లందరూ బాగా పర్ ఫార్మ్ చేశారు. నాకు వాళ్లతో ఎక్కువగా సీన్స్ ఉండవు. ఎందుకు అనేది మూవీలో చూడండి. డానీ ఒక క్యారెక్టర్ నాతో పాటు ఉంటుంది. అజనీష్ లోకనాథ్ గారి మ్యూజిక్ లో నేను చేసిన థర్డ్ ఫిల్మ్ ఇది. ట్రైలర్ లో మీరు బీజీఎం ఎంత బాగుందో విని ఉంటారు. తమ్ముడు మూవీ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.

నటి స్వసిక విజయన్ మాట్లాడుతూ – తమ్ముడు మూవీలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఫీలవుతున్నాయి. నేను కెరీర్ లో బిగినింగ్ లో ఉన్నాను. ఇలాంటి టైమ్ లో మంచి రోల్ దొరకడం సంతోషంగా ఉంది. అందుకు నిర్మాత దిల్ రాజు గారికి, డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారికి థ్యాంక్స్ చెబుతున్నా. తమ్ముడు మూవీలో టాలెంటెడ్ కాస్టింగ్ తో నటించడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుంది. జూలై 4న తమ్ముడు మూవీని థియేటర్స్ లో చూడండి. అన్నారు.

నటి లయ మాట్లాడుతూ – నేను సినిమా ఇండస్ట్రీ నుంచి విరామం తీసుకుని 20 ఏళ్లవుతోంది. తమ్ముడు మూవీతో తిరిగి నా నట ప్రయాణం మొదలుపెట్టాను. సొంతింటికి తిరిగి వచ్చిన అనుభూతి కలుగుతోంది. బ్రేక్ తర్వాత ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు సందేహాలు, భయాలు ఉండేవి. ఈ సినిమా టీమ్ నాలో ఆ భయాన్నిపోగొట్టి నమ్మకాన్ని కలిగించారు. శ్రీరామ్ వేణు గారు నాతో 2 రోజులు ఫొటో షూట్ చేయించి ఈ మూవీకి తీసుకున్నారు. అలాగే ఎంతోమంది ఆర్టిస్టులకు అవకాశాలు ఇస్తున్న దిల్ రాజు గారి బ్యానర్ తో నేను తిరిగి చిత్ర పరిశ్రమకు రావడం హ్యాపీగా ఉంది. మా ఆన్ స్క్రీన్ తమ్ముడు నితిన్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. నేను తిరిగి ఇండస్ట్రీకి వచ్చానంటే అందుకు నా భర్త, పిల్లల సహకారం ఎంతో ఉంది. నేను ఇప్పటిదాకా చేయాలనుకున్న పాత్రలు, సినిమాలు చేసే అవకాశం మరోసారి టాలీవుడ్ కల్పించింది. తమ్ముడు సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం మా అందరిలో ఉంది. అన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ – మా సంస్థలో సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేద్దామా అని ఎదురుచూశాం. ఈ సినిమా కోసం డైరెక్టర్ శ్రీరామ్ వేణు నాలుగేళ్లు కష్టపడ్డాడు. ఈ కథ అనుకున్నప్పుడే విజువల్, సౌండింగ్ కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తానని శ్రీరామ్ చెప్పాడు. అన్నట్లుగానే చాలా కష్టపడి చేశాడు. ఈ సినిమా ముద్దుల మామయ్యలా ఉంటుందా అని మన మీడియా మిత్రులు అడుగుతున్నారు. ఇది అక్కా తమ్ముడి మధ్య జరిగే కథ అయితే కొత్త కాన్సెప్ట్ మూవీ. దీనికి రిఫరెన్స్ లేదు. ట్రైలర్ చూశారు. మీ అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. రేపు థియేటర్ లోనూ ఇదే రెస్పాన్స్ వస్తుందని, తమ్ముడు మూవీనే ఒక రిఫరెన్స్ గా ఉంటుందని నమ్ముతున్నాం. సిస్టర్ క్యారెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు శ్రీరామ్ వేణు యూఎస్ లో ఉన్న లయ గారిని అప్రోచ్ అయి, స్క్రిప్ట్ చెప్పి ఒప్పించాడు. లయ గారు మా సంస్థ ద్వారా మళ్లీ ఇండస్ట్రీకి రావడం హ్యాపీగా ఉంది. కాంతార తర్వాత సప్తమి గౌడను మంచి క్యారెక్టర్ కు సెలెక్ట్ చేశాడు వేణు. నితిన్ కు తమ్ముడు మూవీ చాలా ఇంపార్టెంట్. ట్రైలర్ బాగుందంటూ మన మీడియా మిత్రుల నుంచి ఫోన్స్ , మెసేజెస్ వస్తున్నాయి. మేము ఎగ్జామ్ రాశాం. జూలై 4 న రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా మా మూవీ ఆడియెన్స్ కు నచ్చుతుందని నమ్ముతున్నాం. ఈ రోజు ప్రేక్షకుల్ని థియేటర్స్ కు తీసుకురావడం కష్టంగా ఉంది. మా ట్రైలర్ నచ్చింది కాబట్టి మీడియా మిత్రులు మా మూవీకి బాగా ప్రచారం కల్పించారు. గత ఆరు నెలల్లో నాలుగైదు సినిమాలు మాత్రమే ఆదరణ పొందాయంటే థియేట్రికల్ గా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మా డైరెక్టర్, హీరో, ఇతర టీమ్ అంతా ఒక మంచి మూవీ చేసేందుకు కష్టపడ్డారు. థియేట్రికల్ గా ఎంజాయ్ చేయాల్సిన సినిమా తమ్ముడు. మీరు తప్పకుండా మూవీని ఎంజాయ్ చేస్తారు. తమ్ముడు మేకింగ్ టైమ్ లో టెక్నికల్ గా క్వాలిటీ కోసం ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సివచ్చింది. వేణును పిలిచి అడిగితే ఈ సినిమాకు విజువల్, సౌండ్ క్వాలిటీగా చేస్తున్నామని అన్నాడు. బడ్జెట్ గురించి చెప్పగానే, నేను ఇప్పటినుంచి ఒక్క రూపాయి కూడా డ్రా చేయను అన్నాడు, అలాగే నితిన్ కు ఫోన్ చేసి పరిస్థితి చెబితే రాజు గారు మీరు ఎంత పంపిస్తారో పంపించండి నా రెమ్యునరేషన్ గురించి పెద్దగా డిమాండ్ చేయను అన్నారు. ప్రొడ్యూసర్ పరిస్థితి తెలుసుకుని డైరెక్టర్, హీరో ఇలా సపోర్ట్ చేయడం గొప్ప విషయం. ఇది ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని తీసుకురావాలి. సినిమా సక్సెస్ అయితే అందరి రెమ్యునరేషన్స్ పెరుగుతాయి. కానీ ఫ్లాప్ వస్తే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు. తమ్ముడు మూవీ ట్రైలర్ కు జెన్యూన్ గా ఎన్ని వ్యూస్ వస్తాయో అంతే చెప్పాలనుకున్నాం. సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. తెలుగు సినిమా నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఈ పొజిషన్ ను కాపాడాలంటే అందరం కష్టపడాలి. ప్రతి సినిమాను జెన్యూన్ గా ఆడియెన్స్ ముందుకు తీసుకెళ్లాలి. అందుకు మీడియా మిత్రుల సపోర్ట్ కూడా కావాలి. అన్నారు.

దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ – తమ్ముడు మూవీ ట్రైలర్ కు మీ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా ఉంది. నేను మాట్లాడాల్సింది అంతా స్క్రీన్ మీద ట్రైలర్ లో చూశారు. ఇప్పటినుంచి మా మూవీ గురించి మీరు ఏం చెబుతారో వినాలని ఎదురుచూస్తున్నా. తమ్ముడు కథను కొందరు హీరోలకు చెబితే రిజెక్ట్ చేశారు. కానీ నితిన్ ఈ కథలోని ఎమోషన్ అర్థం చేసుకుని నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. రేపు తమ్ముడు సినిమా సాధించబోయే సక్సెస్ కు క్రెడిట్ ను దిల్ రాజు గారికి, నితిన్ కు, లయ గారికి, నా ఇతర టీమ్ అందరికీ ఇస్తాను. ఈ సినిమాకు షెడ్యూల్, డేట్స్, వెదర్ ఇష్యూస్ వచ్చాయి. అందుకే కొంత లేట్ అయ్యింది. తమ్ముడు పక్కా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ మూవీ. అయితే ఇందులో కొత్త స్క్రీన్ ప్లే చూస్తారు. ఐకాన్ కథ వేరు, ఇది వేరు. మా మదర్, సిస్టర్, డాటర్, వైఫ్..ఇలా నా లైఫ్ లో ప్రేమించే వుమెన్ ఉన్నారు. అందుకే నా ఎమోషన్స్ అన్నీ వాళ్లతోనే ఉంటాయి. నా మూవీస్ లోనూ అదే రిఫ్లెక్ట్ అవుతుంటుంది. తన కోసం కాకుండా సినిమా కోసం ఆలోచించే హీరో నితిన్. పవన్ గారి తర్వాత అలాంటి క్వాలిటీ నితిన్ లో చూశాను. నితిన్, నేను, రాజు గారు పవన్ గారి ఫ్యాన్స్. ఆయన అభిమానులుగా మా మూవీకి తమ్ముడు టైటిల్ పెట్టుకున్నాం. అన్నారు.

హీరో నితిన్ మాట్లాడుతూ – తమ్ముడు మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. ఈ సినిమాకు లయ గారు చాలా ఇంపార్టెంట్. ఆమె చాలా బాగా పర్ ఫార్మ్ చేశారు. అలాగే సప్తమి గౌడ ఈ చిత్రంలో కీ రోల్ చేశారు. స్వసిక చూడ్డానికి సాఫ్ట్ గా ఉంది గానీ ఈ మూవీలో ఆమె క్యారెక్టర్ సర్ ప్రైజ్ చేస్తుంది. నా ఎడిటర్ ప్రవీణ్ పూడి, మా డీవోపీ గుహన్ గారు, అజనీష్ గారు సూపర్బ్ గా ఔట్ పుట్ ఇచ్చారు. మా డైరెక్టర్ వేణు గారు నాలుగేళ్లు ఈ చిత్రం కోసం కష్టపడ్డారు. ఎక్కువగా ఫారెస్ట్ లో షూట్ చేశాం. నా కెరీర్ బిగినింగ్ లో దిల్ సినిమాకు రాజు గారు హయ్యెస్ట్ బడ్జెట్ పెట్టారు. అప్పట్లో సెట్ సాంగ్ కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. మళ్లీ తమ్ముడు మూవీకి నా కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ ఖర్చు చేశారు. జూలై 4న మా మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – నితిన్, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్, బేబీ శ్రీరామ్ దిత్య, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – కేవీ గుహన్
ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి
మ్యూజిక్ – అజనీష్ లోకనాథ్
పీఆర్వో – వంశీ కాకా, జీఎస్ కే మీడియా
బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత – దిల్ రాజు, శిరీష్
రచన -దర్శకత్వం – శ్రీరామ్ వేణు