విష్ణు మంచు ‘కన్నప్ప’ చిత్రానికి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక…
జూలై 5న హుషారు రీ-రిలీజ్

యువతను నవ్వించి, వివిద భావోద్వేగాలతో మనసును హత్తుకున్న చిత్రం హుషారు మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. కాలేజీ రోజుల అనుభూతులను, స్నేహితుల మధ్య బంధాన్ని, యువత ఎదుర్కొనే సవాళ్ళను హాస్య, భావోద్వేగాలతో తీసిన ఈ చిత్రం జూలై 5న రీ-రిలీజ్ కానుంది.
లక్కీ మీడియా, ASIN, HK ఫిలిమ్స్ సమర్పణలో, లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ , రియాజ్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీ హర్ష కొంగంటి దర్శకత్వం వహించారు. మొదటి విడుదల సమయంలోనే ఈ చిత్రం యూత్‌లో భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు మళ్లీ అదే క్రేజ్‌తో థియేటర్లకు తిరిగి వస్తోంది.
ఈ చిత్రంలో తేజస్ కంచెర్ల, తేజ్ కురపాటి, అభినవ్ మేడిశెట్టి, దినేష్ తేజ్ వంటి యువ నటులు పాత్రలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసాయి. సంగీత దర్శకుడు రధన్ అందించిన పాటలు అప్పట్లో యువత ఫేవరెట్‌గా మారాయి.
యువత జీవితాన్ని ప్రతిబింబించిన ఈ చిత్రం మళ్లీ ఒక మంచి అనుభూతిని అందించనుంది.