రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్…
పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ పై మాట్లాడిన మాటలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి
విషయం : ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ విభాగంలో నుండి పని చేసిన సభ్యుల పై పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అధినేత విశ్వప్రసాద్ గారు మాట్లాడిన మాటలను తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఖండిస్తూ…
పై విషయం గురించి యావత్ సినీ పరిశ్రమకు, ప్రజలకు మరియు డిజిటల్ మీడియా/ప్రింట్ మీడియా వారికి తెలియజేయునది ఏమనగా.. సినిమాలో కథను అనుసరించి దర్శకుల ఊహను దృశ్యరూపంలో చూపించే /నిరించే కళాదరక్షులు చాలా కీలకం అన్నవిషయం తెలిసినదే. సృష్టికి ప్రతిసృష్టిని దృశ్యరూపములో చూపించే మేధాసంపత్తి కలిగిన అతిముఖ్యమైన విభాగమే కళాదర్శకత్వ విభాగం.. అంతటి విలువైన /ప్రాముఖ్యత కలిగిన విభాగముపై ఇటీవల ఒక ప్రముఖ మీడియా ఛానలులో “ఆర్ట్ మాఫియా” అంటూ వ్యాఖలు చేసిన సదరు పీపుల్స్ మీడియా నిర్మాత్ర గారి మాటలను కళాదర్శకత్వ / ఆర్ట్ డైరెక్టర్స్ విభాగం ముఖఖంఠంతో ఖండిస్తున్నాము.
సినిమా ప్రారంభానికి ముందు, కథ తరువాత అందుకు సంబందించిన ప్రొడక్షన్ డిజైనర్ / ఆర్ట్ డైరెక్టరు గారు డిజైన్స్ చేసిన తరువాత సినిమాటోగ్రాఫరుతో దర్శకుల సూచనలను తాను అనుకుంటున్నసినిమా ఉహ రూపములో ఉన్నటువంటి అంశం, చర్చల అనంతరమే బడ్జెట్ మరియు సెట్ నిరాణం వంటి అంశాలు నిరాత దృష్టికి వెళతాయి.. సెట్స్ నిర్మాణ సమయములో డైరెక్టర్ కథాపరంగా చేర్పులు, మార్పులు గాని, ఇంకాస్త మంచి ఆలోచనలు వచ్చినప్పుడు సెట్స్లో మార్పులు చేయవలసి వచినప్పుడు నిర్మాత అనుమతి తో ఆ ఖర్చులు పెరుగుతాయి / తగ్గుతాయి. ఈ విషయం సినిమా తీసే ఏ నిర్మాతకైనా అవగాహనా / ఆలోచన ఉంటుంది. వారు
ఇటీవల కాలములో పలు సినిమాలు నిర్మిస్తూ ఎంతోమంది కార్మికులకు ఉపాధి కలించారు, కల్పిస్తున్నారు, దానికి కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
కానీ ఈ విధంగా మీడియాలో మా గురించి తప్పు మాట్లాడే సదరు నిరాత గారు, తన సినిమాకు జరిగిన సదరు అంశముపై ఫిలింఛాంబరు దృష్టికి తీసుకెళ్లవచు/ అక్కడ ప్రాక్టికల్ గా ఎం జరిగిందో, ఆ సినిమాకు పనిచేసిన ప్రొడక్షన్ డిజైనర్ /ఆర్ట్ డైరెక్టర్ పై కనీసం తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ ద్వారా అయిన సదరు వల్లి వివరణ తీసుకోవచ్చు అలాచేయకుండా తనకు తాను గా మీడియా ముందు కళాదర్శకత్వ విభాగముపై అభాండాలు వేయడం ఒక దురభిప్రాయంగా భావిస్తున్నాను.
మద్రాసు నుండి ఎన్నో ఇబందులకు గురై మన తెలుగు గడ్డ మీద ఒక అంకితభావముతో, నిబద్ధతతో కుటుంబాలకు కూడా దూరమై సినిమాలకు పనిచేస్తున్నఎంతో మంది మన తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్స్ అసోసియేషన్ సభులను మాఫియా తో పోలడ్డం సరైన పద్దతి కాదని తెలియజేస్తున్నాము. సెట్ నిర్మాణములో గతములోలేనటువంటి కాంట్రాక్ట్స్ వ్యవస్థను ప్రోత్సహించడంవల్ల, వారి అవగాహనలోపాలవల్ల నష్టాలు జరుగుతున్నాయని సదరు నిర్మాత తెలుసుకోవాలి.
సినీ పరిశ్రమ ఏర్పడిన తొలినాటి నుండి నేటి సినిమాల వరకు ఎంతో మంది ఆర్ట్ విభాగములో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి కలిగిన నిష్ణాతులైన ఆర్ట్ డైరెక్టర్స్ వునార్లు. ఆర్ట్ అన్నది professional గా చూసినప్పుడు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నక్రాఫ్ట్. తెలుగు సినీ ఆర్ట్ డైరెక్టర్ అసోసియేషనులో మారుతున్న ప్రస్తుత టెక్నా లజీస్ ని అనుసరించి మెంబర్కి skills విషయంలోను మరియు సినిమాల ప్రాక్టికల్ experience తో పాటు తగు సూచనలు మరియు నియమాల ద్వారా మెంబర్షిప్ ఇవ్వ డం జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా, గమనించగలరు.