Skip to content

ప్రైమ్ వీడియోలో సత్య దేవ్ నటించిన అరేబియా కడలి అమెజాన్ ప్రైమ్ వీడియోలో లో ఆగస్టు 8 న విడుదల

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియో, తన తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ అరేబియా కడలిని ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. భావోద్వేగాలతో నిండిన ఈ సర్వైవల్ డ్రామాను ప్రముఖ దర్శకులు క్రిష్ జాగర్లమూడి మరియు చింతకింది శ్రీనివాసరావు రూపొందించగా, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై వై. రాజీవ్ రెడ్డి మరియు సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ అద్భుతమైన సిరీస్‌కు దర్శకత్వం వహించినది వి.వి. సూర్య కుమార్. అరేబియా కడలిలో ప్రముఖ నటులు సత్యదేవ్ మరియు ఆనంది ప్రధాన పాత్రల్లో నటించగా, నాజర్, రఘు బాబు, దలీప్ తాహిల్, పూనమ్ బజ్వా, ప్రభావతి, హర్ష్ రోషన్, ప్రత్యూష సాధు, కోట జయరాం, వంశీ కృష్ణ, భరత్ భాటియా, చంద్ర ప్రతాప్ ఠాకూర్, డానిష్ భట్, రవి వర్మ, అమిత్ తివారి, నిహార్ పాండ్యా మరియు ఆలొక్ జైన్ వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో భారతదేశంతో పాటు 240కి పైగా దేశాలు మరియు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆగస్టు 8న విడుదల కానుంది.

ఈ కల్పిత కథానికలో ప్రత్యర్థి గ్రామాల నుండి వచ్చిన మత్స్యకారులు అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి, ఓ విదేశీ ప్రాంతంలో బందీలుగా మారిన విషాదకర సంఘటనను హృదయానికి తాకేలా అరేబియా కడలి చిత్రీకరించారు. ఈ కథలో రెండు ప్రధాన ప్రయాణాలు ఉంటాయి—బదిరి మరియు అతని సహచర మత్స్యకారుల సముద్రపు ప్రమాదాలు, బందీ జీవితం; అలాగే వ్యవస్థను ఎదిరించే ధైర్యవంతమైన మహిళగా గంగా ఎదుగుదల. ఈ ప్రయాణాల్లో వారు అనుకోని స్నేహాలు ఏర్పరచుకుంటారు, కొత్త సంబంధాలు నిర్మించుకుంటారు, శక్తివంతమైన శత్రువులను ఎదుర్కొంటారు. అరేబియా కడలి అనేది సహనానికి, విపత్తులో పుట్టిన సోదరతత్వానికి, స్వేచ్ఛ కోసం జరిగే పోరాటానికి అంకితమైన ఆకట్టుకునే కథ. సరిహద్దులతో విభజించబడిన ప్రపంచంలో, ఈ అరేబియా కడలి సిరీస్ మానవత్వం సహజమని గుర్తుచేస్తుంది.

“అరేబియా కడలి అనేది అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకున్న సాధారణ వ్యక్తుల ధైర్యాన్ని, సహనాన్ని ప్రశంసించే తెలుగు డ్రామా,” అని ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, హెడ్ ఆఫ్ ఒరిజినల్స్ నిఖిల్ మాధోక్ తెలిపారు. “ఈ సిరీస్ అనేక మానవీయ భావాలను—అవిశ్వాసం, ఐక్యత, గర్వం, బతకాలన్న తపన—ప్రభావవంతంగా ప్రతిబింబిస్తుంది. సత్యదేవ్, ఆనంది అద్భుతమైన నటనతో పాటు, ప్రతిభావంతులైన నటవర్గం, అద్భుతమైన సృజనాత్మక బృందం ఈ సిరీస్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి. అరేబియా కడలి మా తెలుగు ఒరిజినల్స్ శ్రేణిలో ఒక శక్తివంతమైన సిరీస్. ఆగస్టు 8న ఈ ప్రభావవంతమైన కథను మా వినియోగదారులకు అందించేందుకు మేము ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం.” అని అన్నారు.

“అరేబియా కడలి మా కోసం కేవలం మరో సిరీస్ మాత్రమే కాదు. ఇది ధైర్యం మరియు సంకల్పంతో నిండిన హృదయాన్ని హత్తుకునే కథ,” అని నిర్మాత వై. రాజీవ్ రెడ్డి అన్నారు. “ఈ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే, నిజమైన కథనాన్ని, సత్యదేవ్ మరియు ఆనంది అద్భుతమైన నటనను, మరియు భావోద్వేగాలను ప్రతిబింబించే దృశ్యకళను సమపాళ్లలో సమన్వయం చేయడమే. ప్రైమ్ వీడియోతో కలిసి, ఈ కథను దీనికి తగిన స్థాయిలో జీవం పోయగలిగాం. అరేబియా కడలిలో ఉన్న భావోద్వేగాల లోతు, మానవత్వంతో నిండిన కథన శైలి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని మేము నమ్ముతున్నాం.’’ అని అన్నారు. ఈ సిరీస్ ఆగస్టు 8న ప్రైమ్ వీడియోలో మాత్రమే విడుదల కానుంది.