- ఆగస్ట్ 8న తమిళంలో స్ట్రీమింగ్.. 27 నుంచి తెలుగు, కన్నడల్లో స్ట్రీమింగ్ భారతదేశంలోని అతిపెద్ద…
ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ నాయకులు కనిపించడం లేదు: నిర్మాత నట్టి కుమార్ ఫైర్

తెలుగు సినీ పరిశ్రమలో పద్దెనిమిది రోజుల సమ్మెకు ముగింపు పలకడం సంతోషకరం, ఇందుకు చొరవ తీసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, మెగాస్టార్ చిరంజీవి గార్కి, అలాగే లేబర్ కమీషనర్ గార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ అన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాదారు.
సినీ కార్మికుల సమ్మె ముగియడం సంతోషకరమే అయినప్పటికీ, మా చిన్న నిర్మాతలకు, అలాగే వివిధ సంఘాలకు చెందిన కార్మికులకు అనేక సందేహాలు ఉన్నాయని, వాటిని తీర్చేందుకు చర్చలలో పాల్గొన్న ఫిలిం ఛాంబర్ పెద్దలు కానీ, అటు ఫెడరేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు కానీ ఎవరూ కనిపించడం లేదని నట్టి కుమార్ అన్నారు.