రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్…
*యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటుతున్న విజయ్ దేవరకొండ “కింగ్డమ్”

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “కింగ్డమ్” యూఎస్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది. సినిమా రిలీజ్ కు రెండు వారాల ముందుగానే యూఎస్ లోని 64 లొకేషన్స్ లో 135 షోస్ కు భారీగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటిదాకా “కింగ్డమ్” మూవీకి 15 కె ( 13.63 లక్షల రూపాయల) టికెట్ సేల్స్ జరిగాయి. సినిమా ట్రైలర్ రిలీజ్ కూడా చేయకముందే, ఏ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ తో ప్రమోషన్ జరపకముందే “కింగ్డమ్” సినిమాకు ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ఈ మూవీ మీద ఉన్న క్రేజ్ ను చూపిస్తోంది. “కింగ్డమ్” టీజర్ రిలీజైనప్పటి నుంచే ఈ మూవీ మీద అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.
“కింగ్డమ్” చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందిస్తున్నారు. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. “కింగ్డమ్” సినిమా ఈ నెల 31న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.