Skip to content

‘విరాటపాలెం’ విజయమే అన్నింటికీ సమాధానం చెబుతుంది.. సక్సెస్ మీట్‌లో నిర్మాత KV శ్రీరామ్

తెలుగులో విజయవంతమైన ఒరిజినల్ షోలు, చిత్రాలతో ఆకట్టుకునే ZEE5 ఇప్పుడు ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ అనే ఇంట్రెస్టింగ్ సిరీస్‌తో అలరిస్తోంది. సోషల్ మీడియా సెన్సేషన్ అభిజ్ఞ వూతలూరు ప్రధాన పాత్రలో నటించిన ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్‌కు పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్‌పై KV శ్రీరామ్ ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ సిరీస్ జూన్ 27 నుంచి ZEE5లో టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో శనివారం నాడు టీం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..

జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ మాట్లాడుతూ .. ‘నేను స్టేజ్ మీద ఎక్కువగా మాట్లాడను. జీ తెలుగు సంస్థకు ఇది 20వ వసంతం. ఈ ప్రయాణంలో మాకు మీడియా ఎంతో అండగా నిలబడింది. మా టీం సహకారం వల్లే ఇంత సక్సెస్ ఫుల్‌గా సాగుతున్నాం. మేం వంద శాతం ఒరిజినల్ కంటెంట్, షోలను తీసుకు వచ్చాం. మేం ఎన్నో ఐకానిక్ షోలను చేశాం. మేం వేసిన బాటలో ఎంతో మంది నడిచారు. మేం ఎన్నో ఒరిజినల్ ఐడియాస్‌ను క్రియేట్ చేశారు. ‘ఆరంభం ఒక్క అడుగు’తో అంటూ ఇక్కడి వరకు వచ్చాం. ఓటీటీ సంస్థల్లో మేం స్టాండర్డ్స్‌ను సెట్ చేశాం. గాలివాన, ఏటీఎం, పరువు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, పులి మేక ఇలా ప్రతీ చోటా మేం ఒరిజినల్ కంటెంట్‌తోనే వచ్చాం. పులి మేక అనేదే ఫస్ట్ ఫీమేల్ కాప్ స్టోరీ. ఆ తరువాత ఎన్నో కాప్ స్టోరీలు వచ్చాయి. ఓటీటీల్లో ఎన్నో కాప్ స్టోరీలున్నాయి. ఓ కాప్ స్టోరీ కావాలని నేనే దివ్యను అడిగాను. అప్పుడే దివ్య సొంతంగా ఈ కథను రాసుకున్నారు. మేం జరిగిన వివాదం గురించి మాట్లాడం. మా కంపెనీ పాలసీని దాటి మేం మాట్లాడం. వ్యవహారం కోర్టులో ఉన్నప్పుడు మేం ఏమీ మాట్లాడకూడదు. ఇంత నెగెటివిటీ ఉన్నా కూడా మా సిరీస్‌కు ఇంతటి రెస్పాన్స్ వచ్చింది. మేం ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ, హద్దుల్ని చెరిపి వేస్తూ వచ్చాం.. ఇంకా ఇలాంటి పాత్ బ్రేకింగ్ కంటెంట్‌తో వస్తూనే ఉంటాం. సత్యమేవ జయతే. మేం మా కాంపిటీటర్స్ పట్ల ఎంతో గౌరవం ఉంది. మా సంస్థను కించపర్చేలా మాట్లాడిన వారిపై పరువునష్టం దావా వేశాం. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంద’ని అన్నారు.

నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ .. ‘‘రెక్కీ’తో మేం సక్సెస్ సాధించాం. రెక్కీతోనే నేను వెబ్ సిరీస్‌లు నిర్మించడం ప్రారంభించాను. నాకు జీ5లో ఇంత మంచి అవకాశం ఇచ్చిన అను మేడంకు థాంక్స్. ఆమె ఇచ్చిన సహకారంతోనే ఇవన్నీ చేయగలుగుతున్నాం. ‘రెక్కీ’ తరువాత ఎన్నో కథలు వింటే ‘విరాటపాలెం’ పాయింట్ నన్ను హంట్ చేసింది. ‘రెక్కీ’ చాలా కొత్తగా ఉంటుందని, అందరికీ నచ్చుతుందని ప్రమోషన్స్‌లో చెప్పాం. ఇప్పుడే అదే జరుగుతోంది. ‘విరాటపాలెం’ను ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మేం ఇక్కడ ఎవ్వరి గురించి మాట్లాడటానికి రాలేదు. మా మాటలే కంటే మా విజయమే అన్నింటికీ సమాధానం చెబుతుంది’ అని అన్నారు.

జీ5 తెలుగు వైస్ ప్రెసిడెంట్, కంటెంట్ హెడ్ దేశ్ రాజ్ మాట్లాడుతూ .. ‘‘పులి మేక’, ‘బహిష్కరణ’, ‘పరువు’ ఇప్పుడు ‘విరాటపాలెం’. ఇలాంటి కొత్త కంటెంట్‌లను మేం మాత్రమే క్రియేట్ చేయగలం.. ముందుకు తీసుకెళ్లగలం. ఇంకా ఆడియెన్స్‌ను అలరించేందుకు మరిన్ని కొత్త ప్రాజెక్టుల్ని తీసుకు వస్తున్నాం. ప్రతి నెలా ఓ మంచి వెబ్ సిరీస్‌తో వస్తాం. ప్రతీ ప్రాజెక్ట్‌తో కొత్త నటీనటులు, టెక్నీషియన్లను అందించబోతోన్నాం. విరాటపాలెం ఒక్క రోజులోనే రెక్కీ కంటే డబుల్ వ్యూస్‌ను సాధించింది. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ఆడియెన్స్‌కు థాంక్స్. లీగల్‌గా వెళ్తామని అన్నప్పుడు మేం ఏ విషయాన్ని ఎక్కువగా మట్లాడలేం. వాళ్లకి మా సిరీస్‌ను చూపించాం. వాళ్లు కూడా చూశారు. సైలెంట్‌గా వెళ్లిపోయారు’ అని అన్నారు.

జీ5 తెలుగు ప్రతినిధి సంజయ్ మాట్లాడుతూ .. ‘దివ్య గారు ఈ కథను అద్భుతంగా రాశారు. విక్రమ్ మంచి స్క్రీన్ ప్లే రాశారు. చిన్న ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ అని కాకుండా కథను నమ్మి కెమెరామెన్ మహేష్ పని చేస్తుంటారు. శ్రీరామ్ గత పదహారేళ్లుగా మాతో పని చేస్తూనే ఉన్నారు. ‘విరాటపాలెం’ను శ్రీరామ్ తన భుజాన వేసుకుని తీసుకు వెళ్లారు. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

జీ5 తెలుగు ప్రతినిధి లాయిడ్ మాట్లాడుతూ .. ‘మా కోసం ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. విరాటపాలెం సిరీస్‌కు ఇంత మంచి విజయాన్ని అందించిన ఆడియెన్స్‌కు థాంక్స్. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ మీద మేం చేసిన ఈ ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ అయింది. మేం ఇలానే ఇంకా సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్‌ల్ని చేయాలని అనుకుంటున్నామ’ని అన్నారు.

స్క్రీన్ ప్లే రైటర్ విక్రమ్ కుమార్ మాట్లాడుతూ .. ‘మేం ఈ కథను చెప్పిన వెంటనే అనురాధ మేడం గారికి చాలా నచ్చింది. ఆ తరువాత దేశ్ రాజు గారు మా వెన్నంటే నిలబడ్డారు. ఈ ప్రాజెక్ట్ శ్రీరామ్ గారి వల్లే ఇంత వరకు వచ్చింది. ఆయన మా కోసం చేయాల్సిన దాని కంటే ఎక్కువ చేశారు. ఎక్కడో కొన్ని షాట్స్ ఒకేలా ఉన్నాయని భావించి ఏవేవో ఆరోపణలు చేశారు. అలా చేయడం తప్పు. ఇది మా ఒరిజినల్ కంటెంట్. దివ్యకి ఓ ఐడియా వచ్చి అలా మెల్లిగా మేం సొంతంగా డెవలప్ చేసుకున్నామ’ని అన్నారు.

కథా రచయిత్రి దివ్య తేజస్వీ మాట్లాడుతూ .. ‘‘విరాటపాలెం’ సిరీస్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్. విక్రమ్ చెప్పినట్టుగా మాకు అనురాధ మేడం, దేశ్ రాజ్ గారు వెన్నంటే నిలిచారు. జీ5 నాకు ఇంత మంచి ఫ్లాట్ ఫాంను ఇచ్చింది. మా మీద లేనిపోని ఆరోపణలు చేయకండి. కాపీ రైట్ చట్టం మాకు తెలుసు. కొత్త పాయింట్ చెప్పాలనే ఆరాటం మాకు ఉంటుంది. పోలీస్ కథలు కొన్ని వందలు ఉంటాయి.. ఊర్లో జరిగే కథలు ఎన్నో ఉంటాయి. ఓ వ్యక్తి తొందరపడి ఉంటుంది.. కానీ ఎంతో పేరున్న సంస్థ ఆలోచించి మాట్లాడితే బాగుండేది. మేం దీనిపై మాట్లాడాలని అనుకోవడం లేదు. మా విజయమే అన్నింటికీ సమాధానాలు చెబుతుంది. మా సిరీస్‌కు, వాళ్ల సిరీస్‌కు ఒక్క సీన్ కూడా కామన్‌గా ఉండదు. ఇలాంటి ఆరోపణలు నా మీద వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను. ఏదైనా సరే నేను చిరునవ్వుతోనే ఎదుర్కొంటాను’ అని అన్నారు.

కెమెరామెన్ మహేష్ మాట్లాడుతూ .. ‘జీ5లో ఇది నాకు హ్యాట్రిక్ మూవీ. రెక్కీ, పులి మేక, విరాటపాలెం వచ్చాయి. అవన్నీ బ్లాక్ బస్టర్‌లు అయ్యాయి’ అని అన్నారు.

నటుడు సూర్య తేజ మాట్లాడుతూ .. ‘ఇది నా హోం ప్రొడక్షన్. రెక్కీలాంటి విజయం మళ్లీ నాకు దక్కింది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీరామ్ గారికి, జీ5 టీంకు థాంక్స్’ అని అన్నారు.

నటుడు కృష్ణ తేజ మాట్లాడుతూ .. ‘నా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా ఫోన్ చేసి అభినందిస్తున్నారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన శ్రీరామ్ గారికి, అనురాధా గారికి, జీ5 టీంకు థాంక్స్’ అని అన్నారు.

నటుడు సతీష్ మాట్లాడుతూ .. ‘తొమ్మిదేళ్ల తరువాత ఇది నా కమ్ బ్యాక్. సీరియల్స్‌కు గ్యాప్ ఇచ్చాను. శ్రీరామ్ అన్న నాకు ఈ కారెక్టర్ ఇచ్చారు. దేవుడిలా నాకు ఎప్పుడూ శ్రీరామ్ అన్న వెంటే ఉంటారు. అనురాధా మేడం నాకు అమ్మలాంటి వారు. ‘విరాటపాలెం’ నాకు బెస్ట్ కమ్ బ్యాక్ అని అంతా చెబుతున్నారు. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.