మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం…
శుభప్రదం శ్రీనివాస కల్యాణం

రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలోని స్వాగత్ డిలైట్ అపార్ట్మెంట్స్లో శ్రీనివాస కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. వేదపండితులు పరాశర శ్రీరామ బట్టర్, సముద్రాల శిఖామణి, సముద్రాల శ్రీమన్నారాయణలు ఈ వేడుకని సంప్రదాయబద్దంగా జరిపించారు. ఈ సందర్భంగా వారు భక్తులనుద్దేశించి మాట్లాడుతూ–‘‘శ్రీనివాసుల ప్రేమ వారి కల్యాణంతో సుఖాంతం అయింది. కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కల్యాణోత్సవం జరిపించడం శుభప్రదం. కోరుకున్న కోర్కెలన్నీ నెరవేరతాయి. కల్యాణోత్సవం జరిపించటం వల్ల అవివాహితులకు మంచి సంబంధాలు కుదిరి శీఘ్రంగా కల్యాణం జరుగుతుంది. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. అలాగే విద్యార్థులకు విద్య బాగా అబ్బుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది.. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. అందుకే శ్రీనివాస కల్యాణం జరిపించటం సంప్రదాయం. ఈ వేడుకలో పాలు పంచుకున్నవారికి, చూసిన వారికి సకల శుభాలు కలుగుతాయి’’ అని తెలిపారు. పరాశర శ్రీరామ భట్టాచార్య–శ్రీదేవి, ములుగు సుధాకర్ శర్మ–రాధాకుమారి, రాజేంద్రప్రసాద్–స్వాతి, భరత్ కుమార్–స్నేహ, లోకేశ్వర్ రెడ్డి–శారదా దేవి, అఖిల్–శ్రావ్య, చైతన్య–ఇంద్ర ప్రియదర్శిని దంపతులు పాల్గొని, భక్తిశ్రద్ధలతో స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం జరిపించారు.


