Skip to content

సర్కార్ తో ఆట విన్నర్స్ కు ఫ్రాంక్లిన్ ఈవీ బైక్స్ అందజేసిన ‘ఆహా’

ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో సక్సెస్ ఫుల్ నడుస్తున్న గేమ్ షో సర్కార్ సర్కార్ తో ఆట లో గెలిచిన ఇద్దరికి ఈవీ బైక్స్ అందజేసింది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్ లో హోస్ట్ సుడిగాలి సుధీర్ చేతుల మీదుగా విజేతలకు ఈ బైక్స్ ను అందజేశారు. గత నాలుగు సీజన్లుగా ప్రేక్షుకులను అలరిస్తున్న సర్కార్ గేమ్ షో సీజన్ 5 లో ప్రేక్షుకులను కూడా భాగం చేసే ఉద్దేశంతో సర్కార్ తో ఆట అనే కొత్త సెగ్మెంట్ ను ప్రారంభించారు.

షో నడుస్తున్న టైంలోనే గెస్టులతో పాటు ప్రేక్షుకులకు కొన్ని ప్రశ్నలు సంధిస్తారు. వారు వాట్సాప్ ద్వారా సమాధానాలు పంపుతారు. అందులో తాజాగా గెలిచిన ఇద్దరు లక్కీ విన్సర్స్ కు సూపర్ హోస్ట్ సుడిగాలి సుధీర్ ఫ్రాంక్లిన్ ఈవీ బైక్ లను అందజేశారు. మరోవైపు సర్కార్ సీజన్ 5 విజయవంతం కావడం పట్ల ఆహా యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. ఇలాంటి మరిన్ని షోలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.