రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్…
సాయి కుమార్ బర్త్ డే స్పెషల్

విలక్షణ నటుడు సాయి కుమార్ పేరు వింటే ఎన్నో అద్భుతమైన డైలాగ్‌లు మన కళ్ల ముందు మెదులుతాయి. హీరోగా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతమైన చిత్రాలతో దక్షిణాది సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నేడు (జూలై 27) ఆయన 65వ పుట్టిన రోజు. ఇక ఈ ఏడాదితోనే ఆయనకు నటుడిగా 50 ఏళ్లు నిండాయి. ఈ 50ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో గొప్ప చిత్రాలతో మెప్పించిన సాయి కుమార్ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్‌లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. ఇలాంటి అద్వితీయ నటుడి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.
1975 జనవరి 9న ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ చిత్రం కూడా సంక్రాంతికి విడుదలై అప్పట్లో సంచలనం సృష్టించింది. నటుడిగా 50వ ఏటలోకి అడుగు పెట్టిన సాయి కుమార్ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రంలో నటించి మెప్పించారు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇదే ఏడాది సాయి కుమార్ ప్రధాన పాత్రను పోషించిన ‘కోర్ట్’ మూవీ కూడా భారీ విజయాన్ని సాధించింది.
కొత్త తరం ఆర్టిస్టులు వస్తున్నా, గట్టి పోటీ ఏర్పడినా.. నటుడిగా 50 ఏళ్లు గడిచినా కూడా సాయి కుమార్ ఇప్పటికీ చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ.. ప్రతీ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’, నాగ శౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’, కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’, అల్లరి నరేష్ ‘12ఏ రైల్వే కాలనీ’, ‘ధర్మస్థల నియోజకవర్గం’, ‘రాజాధి రాజా’, కోన వెంకట్ గారితో ఓ సినిమా, ఎస్వీ కృష్ణారెడ్డి గారితో మరో చిత్రం అంటూ ఇలా ఫుల్ బిజీగా ఉన్నారు.
సాయి కుమార్ కేవలం తెలుగు ప్రాజెక్టులతోనే కాకుండా కన్నడ, తమిళ చిత్రాలతోనూ సందడి చేస్తున్నారు. కన్నడలో ‘చౌకీదార్’, ‘సత్య సన్నాఫ్ హరిశ్చంద్ర’, శివ రాజ్ కుమార్ గారితో ఓ సినిమా చేస్తున్నారు. తమిళంలో ‘డీజిల్’, విక్రమ్ ప్రభుతో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ఇక వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే దేవా కట్టా ‘మయసభ’, క్రిష్ తెరకెక్కిస్తున్న ‘కన్యా శుల్కం’ అంటూ అలరించబోతోన్నారు.
సాయి కుమార్ తన తనయుడు ఆదితో ‘ఇన్‌స్పెక్టర్ యుగంధర్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఇక సాయి కుమార్ నట వారసత్వాన్ని కూడా ఆది ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఆది త్వరలోనే ‘శంబాల’ అంటూ అందరినీ మెప్పించబోతోన్నారు. సాయి కుమార్ ఇలాంటి పుట్టిన రోజులెన్నో జరుపుకోవాలని అభిమానులు, సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.