ఈ చిత్రంలో రాజ్ వేంకటాచ్ఛ హీరోగా నటించడంతో పాటు కథ, చిత్రకథ, దర్శకత్వం వహించి, ఓ…
సినీ కార్మికుల చర్చలు సఫలం.. నేటి నుంచి షూటింగ్స్ షురూ!

టాలివుడ్ వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. లేబర్ కమిషనర్ మధ్య వర్తిత్వంతో నిర్మాతలకు, కార్మిక సంఘాల మధ్య గురువారం రాత్రి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ లోని లేబర్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన చర్చలు సఫలీకృతమయ్యాయి. దీంతో 18 రోజుల విరామానికి తెరపడినట్లైంది. కార్మికులంతా శుక్రవారం నుంచి యధావిధిగా షూటింగ్స్‌కు హాజరు కానున్నట్లు సినీ కార్మిక సంఘం ప్రతినిధులు ప్రకటించారు. ఫిలిం కార్పొరేషన్ డెవెవెలప్‌మెంట్ చైర్మన్ దిల్‌రాజు, అదనపు కమిషనర్ ఈ.గంగాధర్ ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. రెమ్యునరేషన్ పెంచాలని కోరుతూ సినీ కార్మికులు గత కొంతకాలం గా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రెటరీ దామోదర ప్రసాద్, డైరెక్టర్ తేజ, నిర్మాతలు స్రవంతి రవికిషోర్, బాపినీ డు, సుప్రియ, చెర్రీ సహా ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు అమ్మిరాజు, అలెక్స్, కృష్ణ, ఇతర యూనియన్ నాయకులు ఈ సమావేశానికి హాజరై..కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ..సినీ ప్రపంచంలో హైదరాబాద్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తుందని, ఇందుకు సినీ ప్రముఖులంతా సహకరించాల్సిందిగా అభ్యర్థించారు