Skip to content

JB మోషన్ పిక్చర్స్ తో కొలాబరేట్ అయిన పూరి కనెక్ట్స్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతితో కలిసి అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా మూవీ చేయబోతున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పూర్తయిన ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. నిర్మాతలు స్టార్ నటీనటులను ఒక్కొక్కరిగా పరిచయం చేయడం ఈ ప్రాజెక్ట్ చుట్టూ అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్‌ ని పూరి జగన్నాథ్ పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో చార్మీ కౌర్ ప్రెజెంట్ గా, JB మోషన్ పిక్చర్స్‌ JB నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ తో నిర్మిస్తున్నారు. JB మోషన్ పిక్చర్స్‌తో కొలాబరేషన్ మూవీ గ్రాండియర్ ని మరింతగా పెంచుతోంది,

దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాకి సంబధించిన అన్నీ విషయాల్లో చాలా కేర్ తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులని అలరించే స్క్రిప్ట్, నటీనటులని ఎంపిక చేశారు.

ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, విజయ్ కుమార్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో ఈ పాన్-ఇండియా ఎంటర్‌టైనర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఐదు భాషలలో విడుదల కానుంది.

మరిన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్స్ ని మేకర్స్ త్వరలో రివిల్ చేయనున్నారు.

తారాగణం: విజయ్ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్ కుమార్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, జెబి నారాయణరావు కొండ్రోల్లా
ప్రజెంట్స్: చార్మీ కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్
సిఈవో: విషు రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్టాగ్ మీడియా