రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్…
ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా మేకింగ్ రియాలిటీ షో.. ‘షో టైం’ సినిమా తీద్దాం రండీ
ప్రముఖ నిర్మాత, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఒక కొత్త రియాల్టీ షోకు శ్రీకారం చుట్టారు. సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రియాల్టీ షో ద్వారా కల్పించనున్నారు. మొత్తం 16 సినిమా స్క్రిప్ట్స్, ఆ స్క్రిప్ట్ ను పరిశీలించడానికి 12 మంది జడ్జీలు, సినిమాకు స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడం నుంచి ఆర్టిస్టులు, రచయితలు ఇలా 24 విభాగాల్లో పని చేసే టెక్నీషియన్లను మొత్తం 75 రోజుల్లో ఎన్నుకునే విధానాన్ని రియాల్టీ షో రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
‘షో టైం’ సినిమా తీద్దాం రండి అనే ఉపశీర్షికతో ఒక రియాల్టీ షో ను తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. చాలామంది సినిమా తీయాలన్నా కళతో తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి సినిమా నిర్మిస్తారు కానీ దాన్ని విడుదల చేయడానికి చాలా కష్టాలు పడతారు. చాలామంది డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు కూడా చూసానని అనిల్ సుంకర చెప్పారు. అలాగే ఈ రోజుల్లో సినిమా నిర్మాణ వ్యయం కూడా విపరీతంగా పెరిగిందని, ప్రొడక్షన్ లో చాలావరకు అనవసరమైన ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇలాంటి సవాళ్లు ఎన్నో సినిమా తీసే నిర్మాతకు ఎదురవుతున్నాయని వాటన్నింటినీ ఈ రియాల్టీ షో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
అన్ని రియాల్టీ షోలా మాదిరిగానే ఇది కూడా ఎలాంటి స్క్రిప్ట్ లేని రియాల్టీ షో అని, ఇది ఒక ప్రముఖ ఓటీటీలో ఇంటర్నేషనల్ వైడ్ గా స్ట్రీమింగ్ అవబోతుందని దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తానని తెలిపారు. ఇక ఈ షో కు మొత్తం 16 స్క్రిప్ట్‌లను ఎంపిక చేసుకొని అందులో 4 బెస్ట్ స్క్రిట్లను 12 మంది జడ్జీలు ఫైనల్ చేస్తారని తెలిపారు. ఆ ఫైనల్ అయిన స్క్రిప్ట్‌లకు అన్ని విభాగాల్లో పనిచేసే నిపుణులను ఆర్టిస్టులను షోలోనే ఎన్నుకుంటారని వివరించారు. ఇక ఆ స్క్రిప్ట్స్ నేరుగా ఆసక్తి ఉన్న నిర్మాతలు బెడ్డింగ్ చేసి ఒక కోటి రూపాయల లో కేవలం 30 రోజులలోనే సినిమా పాటలతో సహా షూటింగ్ జరిపేలా ఒక అద్భుతమైన ప్రణాళికను రెడీ చేయబోతున్నట్లు వివరించారు. ఈ రియాల్టీ షో కి సంబంధించి ఆ తర్వాత షో గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.