ఈ చిత్రంలో రాజ్ వేంకటాచ్ఛ హీరోగా నటించడంతో పాటు కథ, చిత్రకథ, దర్శకత్వం వహించి, ఓ…
ఘనంగా త్రివణ గురుపీఠం ప్రారంభోత్సవం

నిర్మాత హరిత గోగినేని, ఏఆర్ అభి ఆధ్వర్యంలో హైదరాబాద్ చిత్రపురి కాలనీలో త్రివణ గురుపీఠాన్ని ఏర్పాటు చేశారు. డివోషనల్, స్పిరిచువల్, ఆస్ట్రాలజీ కలిపి ఒక కొత్త మార్గాన్ని త్రివణ గురుపీఠం ద్వారా ఆవిష్కరిస్తున్నారు. ఈ రోజు త్రివణ గురుపీఠం ప్రారంభోత్సవ కార్యక్రమం పలువురు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా
నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ – ఈ రోజు త్రివణ గురుపీఠం విజయవంతంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. వివిధ పూజా కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేశాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ఆ దేవుడి కృప దక్కిందని నమ్ముతున్నాను. రాలేకపోయిన వారికి కూడా మంచి జరగాలని ప్రార్థిస్తున్నాం. త్రివణ గురుపీఠం అనేది డివోషనల్, స్పిరిచువల్, ఆస్ట్రాలజీ కలిపిన ఒక కొత్త మార్గం. సమస్యలు ఉన్నవారికి, అర్థం కాని ప్రశ్నలు ఎదురైన వారికి సమాధానాలు ఇచ్చే విధంగా ఇక్కడ ప్రయత్నిస్తాం. నేను చేసిన మంత్రసాధనం, జ్యోతిష్య సాధనం పలువురితో పంచుకోవాలనే మంచి ఉద్దేశంతో ఈ త్రివణ గురుపీఠాన్ని ఏర్పాటుచేశాం. జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు, జ్యోతిష్య పరంగా సమస్యలు ఉన్నవారు మా దగ్గరకు వస్తే ఆ సమస్యలు దూరం చేసేందుకు మా వంతు ప్రయత్నం అందిస్తాం.
త్రివణ గురుపీఠం హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఉంది. ఇక్కడ నవగ్రహాలకు, నవగ్రహ దేవతలతో పాటు ఇతర దేవతా పూజలు రోజూ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు పద్ధతి ప్రకారం జరుపబడతాయి. అన్ని దేవతలకు అర్చన, నైవేధ్య, దీపారాధన చేస్తాం. వారానికోసారి అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది. అన్ని పూజలు అందరికీ అందుబాటులో ఉండవు, సౌకర్యాలు లేక చేసుకోలేరు. అలాంటి వారికి సహకారం ఇవ్వాలనే పూర్తి నిస్సార్థంగా త్రివణ గురుపీఠం ఏర్పాటు చేశాం. అన్నారు.