మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం…
లిటిల్ హార్ట్స్” టీమ్ కి కంగ్రాట్స్ చెప్పిన విజయ్ దేవరకొండ

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా టీమ్ ను ఇంటికి ఇన్వైట్ చేసి మీట్ అయ్యారు. విజయ్ ను కలిసిన వారిలో హీరో మౌళి, డైరెక్టర్ సాయి మార్తాండ్, డీవోపీ సూర్య బాలాజీ, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి, ఇతర టీమ్ మెంబర్స్ ఉన్నారు. “లిటిల్ హార్ట్స్” మంచి సక్సెస్ అందుకున్నందుకు టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు విజయ్ దేవరకొండ. ఈ ఫొటోస్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు హీరో మౌళి తనూజ్. ఈ పోస్ట్ లో విజయ్ దేవరకొండకు మౌళి కృతజ్ఞతలు చెప్పాడు. సోదరుడిలా తమపై విజయ్ ప్రేమ చూపించాడని, ఆయన చెప్పిన మాటల్ని, విశెస్ ను మర్చిపోలేమని మౌళి ఈ పోస్ట్ లో పేర్కొన్నాడు
