‘చాంపియన్’ బ్లాక్‌బస్టర్ విజయంతో యంగ్ హీరో రోషన్ కెరీర్ కీలక మలుపు తిరిగింది. స్వప్న సినిమాస్…
నెగెటివ్ ప్రచారంతో ఈషా విజయాన్ని అడ్డుకోలేరు – వంశీ నందిపాటి

వంశీ నందిపాటి మాట్లాడుతూ ”తొంభై శాతం రివ్యూలు పాజిటివ్‌గా ఉంటాయి.కానీ ఒక నెగెటివ్ క్యాంపెయిన్ సోషల్‌మీడియాలో మా మీద జరుగుతుంది. బుక్‌మై షో రేటింగ్ కావాలని మా సినిమాకు తక్కువ రేటింగ్‌తో చేయిస్తున్నారు. ఈ సమయంలో సినీ పరిశ్రమ అంతా ఏకం కావాలి.కొంత మంది రివ్యూయర్స్ సినిమా చూడకుండా రివ్యూలు రాస్తున్నారు. ఒక మంచి సినిమా మీద ఇలా జరగడం దారుణం. ఎంతో కష్టపడి జనాల వద్ద సినిమాను తీసుకుని వస్తు.. హైదరాబాద్‌లో 26 ప్రీమియర్స్ హౌస్‌ఫుల్ అయ్యాయి. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ చాలా బాగున్నాయి. మంచి ఓపెనింగ్స్ పడ్డాయి. కానీ బుక్‌మై షోలో కావాలని రేటింగ్‌ను టార్గెట్ చేసి.. సినిమా కలెక్షన్స్ బాగున్నాయి.. మౌత్ టాక్ బాగుంది. కానీ మా సినిమాకు పెయిడ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇలాంటివి జరగడం దారుణం. ఎవరు ఎన్ని చేసినా ఈ సినిమా విజయాన్ని అడ్డుకోలేరు.
దామోదర ప్రసాద్ మాట్లాడుతూ ” పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న సినిమాకు కావాలని బ్యాడ్ చేయడం. సోషల్ మీడియాలో ఇలాంటి మాఫియా ఎదగడం ఎవరికి మంచిది కాదు. ఇంత నీచానికి దిగజారి సోషల్‌మీడియాలో మా సినిమాను టార్గెట్ చేసి కావాలని బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదు. నా సినిమాను డ్యామేజ్ చేసిన ఎవరిని వదలను. కావాలని చేసిన ఎవరిని వదలను. సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఓ చిన్న సినిమాకు ఇలాంటి కలెక్షన్లు రావడం నిజంగా మాకు సంతోషంగా ఉంది’ అన్నారు బన్నీవాస్ మాట్లాడుతూ ” బుక్‌మై షోలో కావాలని టార్గెట్ చేసి బుక్‌మై షో రేటింగ్ తగ్గిస్తున్నారు. రివ్యూయర్స్ విశ్లేషణను మేము గౌరవిస్తున్నాను. సినిమాకు ప్రేక్షకులనుంచి మంచి స్పందనకనిపిస్తుంది. సోషల్ మీడియాలో టార్గెట్ చేసి సినిమాను బ్యాడ్ చేస్తున్నారు.
