Skip to content

జనవరి 1న ఆది రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘శంబాల’ హిందీలో విడుదల

ఆది సాయి కుమార్ నటించిన ‘శంబాల’ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్‌తో, హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ మిస్టికల్ థ్రిల్లర్ ప్రస్తుతం థియేటర్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. డిసెంబర్ 25న విడుదలై ఈ చిత్రానికి ప్రస్తుతం అన్ని చోట్ల నుంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో జనవరి 1న హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు.

హిందీ వెర్షన్ ప్రస్తుతం సెన్సార్ సర్టిఫికేషన్ కోసం వేచి ఉందని నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజు తెలిపారు. ఇక హిందీలో ‘శంబాల’ రిలీజ్ అవుతోందని తెలియడంతో ట్రేడ్ వర్గాల్లో మరింత ఉత్సాహం పెరిగింది. అక్కడ మన ‘శంబాల’ ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో? ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో అని అంతా మాట్లాడుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూన ‘శంబాల’ దూసుకుపొతోంది. ఇక అంతే కాకుండా ‘శంబాల’కి ప్రీమియర్లు, డే వన్, రెండో రోజు ఇలా అన్నీ కలిపి చూస్తే మొత్తంగా 5.4 కోట్ల గ్రాస్‌ వచ్చాయి. ఇది ఇప్పటివరకు ఆది సాయికుమార్ కెరీర్‌లో అతిపెద్ద ఓపెనింగ్‌ ఇచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు.

‘శంబాల’కి పెరుగుతున్న మౌత్ టాక్‌తో మెల్లిగా కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రీమియర్ల నుంచి మెల్లిగా మొదలైన పాజిటివ్ టాక్ అలా స్ప్రెడ్ అవుతూనే ఉంది. దీంతో మొదటి రోజు, రెండో రోజు అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఇక ఈ లాంగ్ వీకెండ్‌లోనూ ‘శంబాల’ హవానే కొనసాగేలా కనిపిస్తోంది. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం అందరూ ‘శంబాల’కి క్యూ కడుతున్నారు. యగంధర్ ముని తెరకెక్కించిన తీరు, కొత్త పాయింట్‌ను టచ్ చేయడం, అన్ని రకాల అంశాల్ని జోడించి తెరకెక్కించడం కలిసి వచ్చిన అంశం. ఈ మూవీని చూసిన తరువాత విజువల్స్, ఆర్ఆర్ గురించి అందరూ అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆది సాయికుమార్ నటన ఒకెత్తు అయితే.. టెక్నికల్ టీం చేసిన మాయాజాలం మరో ఎత్తు. ప్రస్తుతం ‘శంబాల’ హిందీ మార్కెట్‌పై కన్నేసింది. త్వరలోనే మేకర్లు ముంబైలో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.