Skip to content

666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ సినిమాలో ప్రియాంక మోహ‌న్‌

వెర్స‌టైల్ స్టార్ ధ‌నంజ‌య ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న ‘666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో అప్డేట్స్‌తో ఆక‌ట్టుకుంటోంది. ఇప్పటికే ప‌లువురు స్టార్స్‌తో నిండిన ఈ సినిమాలోకి ఇప్పుడు పాపుల‌ర్ హీరోయిన్ ప్రియాంక మోహన్ జాయిన్ అయ్యారు. తాజాగా ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేసింది.

రెండు వేర్వేరు పోస్టర్లలో విడుదలైన ఈ ఫస్ట్ లుక్‌లో ప్రియాంక మోహన్ లుక్‌ను గ‌మ‌నిస్తే.. డిజైన్ పరంగానూ, కథకు క‌నెక్ట్ అయ్యేలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఈ పోస్టర్లలో ఆమె వింటేజ్ లుక్‌, క‌ళాత్మ‌క శైలిలో చూపించారు. పోస్టర్స్‌ను జాగ్ర‌త్త‌గా గమనిస్తే ఎన్నో చిన్న విష‌యాలు అర్థ‌మ‌వుతాయి. మొదటి పోస్టర్‌ను చూస్తే..ఆమె వెనుక భాగంలో మెరిసే బంగారు రంగు పౌర్ణమి చంద్రుడితో కనిపిస్తుంది. ఆమె లావెండర్ రంగు బ్లౌజ్‌, పూల డిజైన్ ఉన్న స్కర్ట్‌ ధరించింది. ఈ పోస్టర్‌లో వింటేజ్‌ వాతావరణాన్ని, మోడ్ర‌న్‌ స్టైలింగ్‌, రంగులు క‌ల‌గ‌లిసిన ఫ్రేమ్ ద్వారా చూపించారు. ఇందులో ఆమె ధరించిన ఇయర్‌ఫోన్స్‌ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో ఈ సినిమా టైమ్ ట్రావెల్‌కు సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపొందుతుంద‌ని అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు.

రెండో పోస్టర్‌ను గ‌మ‌నిస్తే ప్రియాంక మోహన్‌ను రెట్రో స్టైల్‌లో చూపించారు. ఆమె ముత్యాల ఆభరణాలు, పువ్వుల‌ డిజైన్ ఉన్న డ్రెస్సు, గ్లవ్స్‌, పెద్ద అంచులు ఉన్న టోపీ ధరించిన లుక్‌లో కనిపిస్తుంది. ఈ లుక్ చూస్తే క్లాసిక్ టైమ్‌ నేపథ్యంతో రూపొందిన థ్రిల్లర్ సినిమాకు చక్కగా సరిపోతుంది. ఈ పోస్టర్‌లో చూపించిందే కంటే దాచిందే ఎక్కువగా ఉంద‌నిపిస్తోంది. అందువల్ల ఆమె పాత్రపై మరింత ఆసక్తి ఏర్ప‌డుతుంది. మృదువైన రంగులు, క్లాసిక్ స్టైలింగ్ పాతకాలపు సినిమాల అందాన్ని గుర్తు చేయ‌ట‌మే కాకుండా. ఆ పాత్ర‌తో సినిమా చుట్టూ ఉన్న మిస్టరీ వాతావర‌ణాన్ని మరింత పెంచుతున్నాయి.

ఈ విజువల్స్‌ చూస్తుంటే అందం, రహస్యం, ఫాంటసీ అన్నీ కలిగ‌లిసిన ఓ వైవిధ్య‌మైన, ప్ర‌త్యేక‌మైన కథా ప్రపంచం ఈ సినిమాలో ఉండబోతున్నట్టుగా అనిపిస్తోంది. దీంతో సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది. .

‘666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ సినిమా నుంచి వ‌చ్చిన క‌న్న‌డ క‌రుణ‌డ చ‌క్ర‌వ‌ర్తి డా. శివరాజ్‌కుమార్, ధనంజయ ఫస్ట్ లుక్స్ నుంచి భారీ సెట్స్‌, వింటేజ్ కెమ‌రాల‌తో, సినిమాపై ఆస‌క్తిని పెంచే అంశాల‌లున్న ఒక ప్రత్యేక ప్రపంచాన్ని రూపొందించేందుకు చిత్రబృందం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇక జనవరిలో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాను వైశాక్ జె ఫిలిమ్స్ బ్యానర్‌పై హేమంత్ ఎం. రావు దర్శకత్వంలో వైశాక్ జె. గౌడ నిర్మిస్తున్నారు. చ‌ర‌ణ్ రాజ్ సంగీత సార‌థ్యాన్ని వ‌హిస్తుండ‌గా..అద్వైత గురుమూర్తి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. విశ్వాస్ క‌శ్య‌ప్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా, ఇంచారా సురేష్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ధనంజయ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘666: ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ సినిమాలో డా. శివరాజ్‌కుమార్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా మూడు షెడ్యూల్స్ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. భారీ బడ్జెట్‌తో, పెద్ద స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.