'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా 'గబ్బర్ సింగ్' స్థాయి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను: పవర్ స్టార్…
“కపుల్ ఫ్రెండ్లీ” అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంచి రెస్పాన్స్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ “కపుల్ ఫ్రెండ్లీ” ఓటిటిలోనూ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది. కపుల్ ఫ్రెండ్లీ మూవీ యూవీ క్రియేషన్స్ కు మంచి సక్సెస్ అందించింది. ఈ ఉత్సాహంలో ఇప్పుడు బైకర్ సినిమాని కూడా యూవీ క్రియేషన్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. కపుల్ ఫ్రెండ్లీ మూవీ మంచి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఇప్పుడు ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ అందుకుంది. సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక మంచి మూవీ చేశారంటూ యూత్ సోషల్ మీడియాలో చాలా అప్రిషియేట్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా మూవీకి బాగా మైలేజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో సినిమా చూస్తున్న ప్రేక్షకులు కపుల్ ఫ్రెండ్లీ మూవీని అప్రిషియేట్ చేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు
“కపుల్ ఫ్రెండ్లీ” చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు.
