టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్…
‘డెకాయిట్’ ప్రాణం పెట్టి చేసిన సినిమా – హీరో అడివి శేష్


- అడివి శేష్ ‘డెకాయిట్’ లవ్& హై వోల్టేజ్ యాక్షన్ గ్రిప్పింగ్ ట్రైలర్ లాంచ్
అడివి శేష్ తన పాన్ ఇండియా చిత్రం ‘డెకాయిట్”తో మరోసారి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే, ఇది మరో ఇంటెన్స్, ఎమోషన్స్ కూడిన కథగా కనిపిస్తోంది. కొత్త దర్శకుడు షానీల్ డియో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.
“డెకాయిట్” కథ హరి, జూలియెట్ మధ్య ఉన్న ఇంటెన్స్ బాండింగ్ చుట్టూ తిరుగుతుంది. ఒక ప్రశాంతమైన జీవితానికి కలలు కంటున్న ఈ జంట జీవితాన్ని, ఒక ద్రోహం పూర్తిగా మార్చేస్తుంది. హరి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. కానీ అతని పరారితో కథ మళ్లీ మలుపు తిరుగుతుంది. ఈ సమయంలో జూలియెట్ తన అనారోగ్యంతో ఉన్న కుమార్తె ప్రాణాలను కాపాడటానికి పెద్ద మొత్తంలో డబ్బు కోసం పోరాడుతుంది. ఈ పరిస్థితుల్లో, హరి ప్రేమికుడి నుంచి సర్వైవర్‌గా మారి, జూలియెట్ అవసరాన్ని ఉపయోగించుకుంటూ క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు.
దర్శకుడు షనిల్ డియో కథను చెప్పిన విధానం ప్రత్యేకంగా నిలుస్తుంది. గత జ్ఞాపకాలు, ప్రస్తుత సంఘటనలను కలిపి చూపించే తీరు ట్రైలర్‌లో ఆకట్టుకుంది. అడివి శేష్ కథా రచనలో కూడా భాగం కావడం వల్ల, ప్రేమ, ద్రోహం, సర్వైవల్ మధ్య జరిగే భావోద్వేగాల ఊగిసలాట చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది.
మృణాల్ జూలియెట్ పాత్రలో ప్రేమికురాలిగా, తల్లిగా రెండింటినీ అద్భుతంగా నటించారు. అనురాగ్ కశ్యప్ కూల్, టెర్రిఫిక్ పోలీస్ పాత్రలో కనిపిస్తూ కథకు మరింత టెన్షన్ తీసుకువచ్చారు. ప్రకాష్ రాజ్ తన అనుభవంతో కథకు బలాన్ని ఇచ్చారు. అలాగే సునీల్, అతుల్ కులకర్ణి వంటి నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
