Skip to content

*అరుణాచల గిరి ప్రదక్షిణ” ఫస్ట్ గ్లిమ్ప్స్ ఆవిష్కరించిన తనికెళ్ళ భరణి

“ఆటగదరా శివా” అంటూ శివతత్వాన్ని ఆవిష్కరించిన ప్రముఖ నటుడు – రచయిత- దర్శకుడు తనికెళ్ళ భరణి… సుప్రసిద్ధ మహిమాన్విత పుణ్యక్షేత్రం అరుణాచలం నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “అరుణాచల గిరి ప్రదక్షిణ” చిత్రం ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. భీమవరం టాకీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.ఎఫ్.ఎక్స్ లో సిద్ధహస్తుడైన యువ ప్రతిభాశాలి హర్ష. ఎం. దర్శకత్వం వహిస్తుండగా… సంగీతద్వయం డా. ఎ. జె. సంధ్యవర్షిణి – డా.వి.ఆర్.ఎ. ప్రదీప్ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం కోసం స్వరపరిచిన ఓ గీతానికి చింతల శ్రీనివాస్ సాహిత్యం సమకూర్చగా… మధు గాత్రం అందించారు. మదర్ సెంటిమెంట్ తోపాటు బలమైన భావోద్వేగాలతో రూపొందుతున్న “అరుణాచల గిరి ప్రదక్షిణ” అద్భుత విజయం సాధించాలని తనికెళ్ళ కోరుకున్నారు. షూటింగ్ రెండో షెడ్యూలు అతి త్వరలో ప్రారంభమవుతుందని, ఏప్రిల్ లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు!!