'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా 'గబ్బర్ సింగ్' స్థాయి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను: పవర్ స్టార్…
“ఎపిక్” మూవీ ఆనంద్ దేవరకొండ బర్త్ డే ప్రోమో

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా “ఎపిక్”. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. వెంకట్ ఉప్పుటూరి, వి.ఎం.ఆర్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి బర్త్ డే ప్రోమో రిలీజ్ చేశారు.
లండన్ లో స్నేహితుల సమక్షంలో హీరో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, ఇండియా నుంచి పేరెంట్స్ ఆనంద్ కు ఫోన్ చేసి విష్ చేయడం, తండ్రి చెప్పీ చెప్పనట్లుగా కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఈ ప్రోమోలో చూపించారు. ఈ ప్రోమోకు బీజీఎంగా అమృతం సీరియల్ టైటిల్ సాంగ్ పెట్టడం కొత్త ఫీల్ కలిగించింది. కల్ట్ బ్లాక్‌బస్టర్ “బేబీ” తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రమిది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘సంచారమే..’ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రేజీ కాంబోలో వస్తున్న “ఎపిక్” మూవీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది.
