నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్…
20న హెల్త్ క్యాంపు

ఈ నెల 20న స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి 86వ జయంతి సందర్భంగా మధిరలో డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ముఖ్యఅతిథిగా యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ 3వ వార్షిక హెల్త్ క్యాంప్
దిగ్గజ నటులు, మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి జయంతిని పురస్కరించుకుని గత మూడేళ్లుగా యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఏటా ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తోంది. గత రెండు హెల్త్ క్యాంప్ లను మొగల్తూరు, భీమవరంలో నిర్వహించారు. ఈ సంవత్సరం కృష్ణంరాజు గారి 86వ జయంతి సందర్భంగా 3వ వార్షిక యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ క్యాంప్ ను ఈ నెల 20వ తేదీన ఖమ్మం జిల్లా మధిర, దెందుకూరు శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నారు.. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క గారు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ హెల్త్ క్యాంప్ లో డయాబెటిక్ సంబంధ కాళ్ల సమస్యలు ఉన్నవారు, ఇతర ఫుట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఉచితంగా పరీక్షలు, మందులు, చికిత్స అందిస్తారు.
ఈ కార్యక్రమం గురించి కృష్ణంరాజు గారి సతీమణి శ్రీమతి శ్యామలాదేవి గారు మాట్లాడుతూ – పేద ప్రజలకు సాయం చేయడం మన బాధ్యత అని కృష్ణంరాజు గారు నమ్మేవారు. ఆయన ఆలోచనకు ప్రతిరూపమే ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు. ఏటా నిర్వహించే ఈ హెల్త్ క్యాంప్ ద్వారా పేద డయాబెటిక్ పేషెంట్స్ కు కావాల్సిన హెల్త్ కేర్, ఇతర వైద్య అవసరాలు అందిస్తున్నాం. అన్నారు.
ప్రముఖ డయాబెటిక్ ఫుట్ సర్జన్ డా. వేణు కవర్థపు ఆధ్వర్యంలో యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ హెల్త్ క్యాంప్ లో మన దేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన 32 మంది ప్రఖ్యాత వైద్యులు పాల్గొననున్నారు. ఈ హెల్త్ క్యాంప్ లో చెకప్ చేయించుకోవాలనుకునే వారు పేర్ల నమోదు కోసం రామకృష్ణ 9440838385, మహేశ్ 9642844362 లను సంప్రదించవచ్చు.
