‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్.. – శివప్రసాద్

వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో అలరిస్తున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన తెలుగు టీజర్, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ శివప్రసాద్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ప్రొడ్యూసర్‌గా మీ జర్నీ గురించి?
మొదట శ్రీరామ్‌తో మాతృ సినిమా నిర్మించాం. తర్వాత రారాజా ప్రొడ్యూస్ చేశాం. సుహాసిని మణిరత్నం గారితో మహతి అనే సినిమా చేస్తున్నాం. ఆ సినిమా షూటింగ్‌లో ఇంకా 10% బ్యాలెన్స్ ఉంది.
విజయ్ సేతుపతి గారి ఏస్ సినిమాను మేము డిస్ట్రిబ్యూట్ చేశాం. మరాఠీలో ఒక సినిమా తీశాం, అది రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఆ సినిమాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ నేనే.
ఇప్పుడు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాను రిలీజ్ చేస్తున్నాం. గీతాంజలి, మిథున్ చక్రవర్తి గారి డిస్కో డాన్సర్ రీ-రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
మా తమ్ముడిని పరిచయం చేస్తూ రంగూన్ రాజా అనే సినిమా చేశాం. ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. జూలైలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా గురించి?
-గత సంవత్సరం ఈ సినిమాకు అగ్రిమెంట్ చేసుకున్నాము. ఈ సినిమా కోసం చాలా మంది ప్రయత్నించారు. కానీ మేమే ముందుగా కమిట్ అయినందున,
