Skip to content

జనవరి 1న విడుదల కానున్న ‘మదం’

నూతన సంవత్సరం కానుకగా ‘మదం’ చిత్రం జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. బలమైన ఎమోషన్స్‌తో సాగే ఈ హార్డ్-హిట్టింగ్ డ్రామా థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఏకైవా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సూర్యదేవర రవీంద్రనాథ్ (చినబాబు), రమేష్ బాబు కోయ ఈ చిత్రాన్ని నిర్మించారు. హర్ష గంగవరపు, ఇనాయ సుల్తానా, అనురూప్, లతా రెడ్డి ఇందులో కీలక పాత్రలు పోషించారు.

రాజీ లేని కథనంతో, వాస్తవికతకు దగ్గరగా ఈ సినిమాను రూపొందించినట్లు నిర్మాతలు తెలిపారు. సినిమాలోని ఇంటెన్స్ సన్నివేశాలు, బోల్డ్ కంటెంట్ కారణంగా సెన్సార్ బోర్డు దీనికి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. కథ, మాటలను నిర్మాత రమేష్ బాబు కోయ అందించగా, వంశీ మల్లా దర్శకత్వం వహించారు. ‘ఈగల్’ ఫేమ్ డేవ్‌జాండ్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

నందమూరి తారకరామారావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, రవి వి సినిమాటోగ్రఫీ అందించారు. కొత్త ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకులకు ఒక వైవిధ్యమైన, థ్రిల్లింగ్ అనుభూతిని పంచేందుకు ‘మదం’ సిద్ధమైంది.