Skip to content

హీరో ఆర్యా పుట్టినరోజు సందర్భంగా ‘ రంజీ ‘ ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో ఆర్యా పుట్టినరోజు సందర్భంగా ‘ రంజీ ‘ ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

ఆర్యా హీరోగా పోలూరు కృష్ణ దర్శకత్వంలో స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోంది. అకృతి నంద సమర్పణలో శ్రీ విజయ వారాహి మూవీస్ బ్యానర్ పై మురుకుంట్ల అరవింద్ & విజయ భారతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ పూర్తయింది.

హీరో ఆర్యా బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘రంజీ’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.

ఇంటెన్స్‌, పవర్‌ఫుల్ ప్రెజెన్స్‌తో కనిపించిన ఆర్యా ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఆయన ధరించిన క్యాజువల్ కాస్ట్యూమ్ ఈ లుక్‌కు మరింత రియలిస్టిక్‌, రిలేటబుల్ వైబ్ తీసుకొచ్చింది. పాత్ర ఎంత ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండబోతుందో ఈ ఫస్ట్ లుక్ స్పష్టంగా తెలియజేస్తోంది.

ఈ చిత్రంలో వ్రంజనా పాండ్య హీరోయిన్ గా నటిస్తోంది. దశరథ్, వాసుకి, ఆడుకలం నరేన్, సమ్మిట గాంధీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. రధన్ మ్యూజిక్ అందిస్తుండగా, రామ్ కె మహేష్ డీవోపీ, నార్నీ శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్, అనిల్ పసల ఎడిటర్.

నటీనటులు: ఆర్యా, వ్రంజనా పాండ్య, దశరధ్, వాసుకి, ఆడుకలం నరేన్, సమ్మిట గాంధీ, మణికందన్ ఆర్., ఆచారి సాయిరాజ్, బెనర్జీ

నిర్మాతలు: మురుకుంట్ల అరవింద్ & విజయ భారతి

సమర్పణ: అకృతి నంద

కథ, కధనం & దర్శకత్వం: పోలూరు కృష్ణ

సినిమాటోగ్రాఫర్: రామ్ కె మహేష్

సంగీతం: రధన్

ఆర్ట్ డైరెక్టర్: నార్నీ శ్రీనివాస్

ఎడిటర్: అనిల్ పసల

లిరిక్ రైటర్స్: సురేష్ బనిశెట్టి, శ్రీరామ్ తపస్వి

డైలాగ్స్: నవీన్ వాసిరెడ్డి

పీఆర్వో: వంశీ శేఖర్