Skip to content

రఘుకుంచె గేదెలరాజు ఏప్రిల్‌ 24న విడుదల…

రఘుకుంచె గేదెలరాజు ఏప్రిల్‌ 24న విడుదల… Telugu News

రఘుకుంచే టైటిల్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా సినిమా ట్యాగ్‌లైన్‌. రఘుకుంచే తో పాటు రామచంద్రం పుణ్యమూర్తుల, వికాస్, టీనా శ్వావ్య, మౌనిక, రవి చిన్నిబిల్లి తదితరులు నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మొదటగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 17న విడుదల చేద్దామనుకున్నారు చిత్ర నిర్మాత దర్శకుడు చైతన్య మోటూరి. ఏప్రిల్‌ 17న దాదాపు తొమ్మిది సినిమాలు విడుదలకు సిద్ధమవ్వటంతో సినిమా హక్కులు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్‌ సలహా మేరకు ఈ చిత్రాన్ని మరో వారం రోజుల తర్వాత అంటే ఏప్రిల్‌ 24న సినిమా విడుదల చేస్తున్నట్టు మేకర్స్‌ తెలియచేశారు. ఈ చిత్రం ట్రైలర్‌కి అనూహ్యమైన స్పందన రావటంతో
రఘు కుంచే , చైతన్య మోటూరిలు మాట్లాడుతూ–‘‘ కంటెంట్‌ ఉన్న సినిమాను పది సినిమాల మధ్యలో విడుదల చేసి ఆ సినిమా అస్థిత్వాన్ని కోల్పోయేలా చేయకూడదు అన్న ఒకే ఒక ఉద్ధేశ్యంతో సినిమాను మరుసటి వారానికి వాయిదా వేస్తున్నామన్నారు. అలాగే సినిమా ట్రైలర్‌ చూసిన ఒక్కొక్కరు ట్రైలర్‌ చాలా కొత్తగా ఉంది అని ప్రతి ఒక్కరు నలుగురికి చెప్పటంతో ఆర్గానిక్‌గా మా సినిమాకి చక్కని బజ్‌ ఏర్పడింది అన్నారు’’.