కంటెంట్ కింగ్ శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ…
‘మృత్యుంజయ్’ సినిమాకి బ్లాక్ బస్టర్ రివ్యూని ఇచ్చిన నేచురల్ స్టార్ నాని

- రేపే చిత్రం భారీ ఎత్తున విడుదల
కంటెంట్ కింగ్ శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రంతో మరోసారి అలరించేందుకు సిద్దంగా ఉన్నారు.
క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ ఆల్రెడీ ఈ మూవీని వీక్షించి మంచి రివ్యూని ఇచ్చారు. రేపు థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడటానికి అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని ఈ మూవీని వీక్షించి తన బ్లాక్ బస్టర్ రివ్యూని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మంచి సినిమాలను ఎల్లప్పుడూ ప్రోత్సహించే నటుడు, తన బిజీ షెడ్యూల్ నుండి ‘మృత్యుంజయ్’ని చూడటానికి సమయం కేటాయించారు. నాని తన స్నేహితుడు శ్రీ విష్ణును ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఇచ్చిన రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. తన తొలి ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించబోతోన్నందుకు నిర్మాత సందీప్ గుణ్ణమ్‌ని కూడా నాని కూడా అభినందించారు.
‘‘మృత్యుంజయ్’ నాకు చాలా నచ్చింది. చివరి వరకు నన్ను కట్టిపడేసింది. శ్రీ విష్ణు తన కామిక్ టైమింగ్, సరదా పాత్రలతో ఎంతగా నవ్విస్తుంటాడో అందరికీ తెలుసు. కానీ ఈ సినిమాలో శ్రీ విష్ణు నటన నన్ను ఆశ్చర్యపరిచింది. సందీప్ గుణ్ణం గారు తొలి ప్రాజెక్ట్‌తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతోన్నారు.. ఆయనకు ముందుగానే నా అభినందనలు.. ఇలాంటి కొత్త కంటెంట్, కొత్త దారిలో సినిమాను నిర్మించడం ఆనందంగా ఉంది. రేపు సినిమా విడుదల కాబోతోన్న నేపథ్యంలో టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
మృత్యుంజయ్ మార్చి 6, 2026న వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా విద్యా సాగర్, సంగీత దర్శకుడిగా కాళ భైరవ పని చేశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, మనీషా ఎ. దత్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షించారు.
