Skip to content

హీరోయిన్ నిధి అగర్వాల్ చేత సీతారే గోల్డ్ & డైమండ్స్ న్యూ షో రూమ్ కొంపల్లి లో ప్రారంభం !!!

సీతారే గోల్డ్ & డైమండ్స్ తమ రెండో ప్రీమియమ్ జ్యూవెలరీ రిటైల్ షో రూమ్ ను సుచిత్ర, కొంపల్లి లో (మెట్రో క్యాష్ అండ్ క్యారీ ) పక్కన గ్రాండ్ ఓపెనింగ్ ద్వారా ప్రకటించింది. 8000 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త షో రూమ్ వినియోగదారులకు విలాసవంతమైన, విశాలమైన మరియు వరల్డ్ క్లాస్ జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు రూపొందించబడింది.

ఈ షో రూమ్ ను ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ కె. పి.వివేకానంద గౌడ్ గారు (ఎంఎల్ఏ కుత్బుల్లాపూర్ ) ప్రారంభించారు. ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. అదనంగా బిజెపి మేడ్చెల్ అర్బన్ జిల్లా కార్యదర్శి శ్రీ భారత్ సింహ రెడ్డి గారు హాజరై ఈ ప్రారంభోత్సవాన్ని మరింత విశేషంగా మార్చారు.

కొంపల్లి సీతారే షో రూమ్ లో గోల్డ్ , డైమండ్, అన్కట్, పోల్కి మరియు జమ్ స్టోన్ జ్యువెలరీల విస్తృత శ్రేణిని అందిస్తున్నారు. సంప్రదాయ నైపుణ్యాన్ని అధినిక డిజైన్ తో మిళితం చేస్తూ రూపొందించిన ఈ షో రూమ్ లో ప్రీమియం ఇంటీరియస్ శ్రేష్టమైన అంబియ్సన్స్ మరియు వ్యక్తిగత మార్గ నిర్దేశం అందించే నిపుణుల బృందం ఉంది. సీతారే లోని ప్రతి గోల్డ్ జ్యువలరీ హెచ్.యు.ఐ. డి హల్ మార్క్ తో ప్రతి డైమండ్ మరియు జేమ్ స్టోన్ కఠిన నాణ్యత ప్రమాణాలతో ఎంపిక చెయ్యబడింది.

గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా సీతారే గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రేత్యేక ఆఫర్స్ ను ప్రకటించింది. పోల్కి మరియు జేమ్ స్టోన్ జ్యువలరీ కొనుగోలుపై సమాన బరువు ప్రీ సిల్వర్ , గోల్డ్ జ్యువలరీ పై ప్రీ ఇన్సూరెన్స్ లైఫ్ టైమ్ ప్రీ మైంటెనెన్స్ , 22 కేరేట్ గోల్డ్ కు 100% ఎక్స్చేంజ్, అస్సుర్డ్ బై బ్యాక్ మరియు కష్టమర్స్ కు అదనంగా పది వేలు డిస్కౌంట్ ఉంది (నిబంధనలు వర్తిస్తాయి)

ప్రారంభోత్సవ సందర్భంలో సీతారే గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజర్ మాట్లాడుతూ…
కొంపల్లిలో మా కొత్త షో రూమ్ ను ప్రారంభించడం మాకు ఎంతో గర్వకారణం. నిజమైన నైపుణ్యం విశ్వసనీయత, మరియు ప్రీమియం షాపింగ్ అనుభవం అందించడం మా లక్ష్యం. ఈ ప్రాంతంలోని వినియోగదారులకు మరింత దగ్గరగా మా సేవలను విస్తరించగలగడం ఆనందంగా ఉందని తెలిపారు.

సితారే గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రస్తుతం చందా నగర్, కొంపల్లి బ్రాంచులను నిర్వహిస్తోంది.