‘కన్నె’లో మాటలకందని భావాలెన్నో..
- సంగీతప్రియుల నుంచి విశేష స్పందన హైదరాబాద్, జూన్ 8, 2025: ఈ స్వరంలో ఏదో మాయ ఉంది, వింటుంటే మనస్సు పులకించిపోతుంది. వినే కొద్దీ వినాలనిపిస్తుంది. అది స్వరం కాదు, హృదయాన్ని మాయ చేసే ఒక మంత్ర స్వరం. ఆ గళంలోని ప్రతి నాదం మనస్సును మెలిపెట్టేస్తుంది. ఆ సంగీత సంచలనం ఎవరో కాదు, మన సిద్ శ్రీరామ్. ఆయన సరికొత్త గీతం 'కన్నె'లో మాటలకందని భావాలను పలికించారు. ఇది ఒక ప్రేమ గీతం. ఈ పాటను అయనే స్వయంగా కంపోజ్ చేసి, పాడారు. తమిళంలో వివేక్, తెలుగులో కిట్టు విస్సాప్రగడ రచించారు. ఈ పాటను ఈనెల 6వ తేదీన వార్నర్ మ్యూజిక్ విడుదల చేసింది. ఏప్రిల్‌లో భక్తిగీతం 'శివనార్' విడుదల…
