Skip to content

పతంగ్‌ను అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు: ప్రణీత్‌ పత్తిపాటి

‘పతంగ్‌’ చిత్రం విషయంలో నాకు వస్తున్న అభినందనలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు సినిమాను ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తుంటే నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించినట్లు అనిపిస్తుంది అంటున్నాడు దర్శకుడు ప్రణీత్‌ పత్తిపాటి’. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం పతంగ్‌. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు సమర్పణలో రూపొందిన ఈ చిత్రం సినిమాటిక్ ఎలిమెంట్స్ , రిష‌న్ సినిమాస్, మాన్‌సూన్‌ టేల్స్‌ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఈ చిత్రానికి విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ మకా , సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మాతలు. చిత్రం విడుదలై యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మధ్య కాలంలో చూసిన వన్‌ఆఫ్‌ బెస్ట్‌ ఫిలిం అంటూ ప్రేక్షకులు ఈసినిమను అభినందిస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు ప్రణీత్‌ పత్తిపాటి సోమవారం విలేకరులతో మాట్లాడాడు..

ఫీడ్‌బ్యాక్‌ ఎలా ఉంది?
టాక్‌తో పాటు కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. యూనివర్సల్‌గా ఈ సినిమాకు హిట్‌టాక్‌..తో పాటు ఓ మంచిసినిమావ చూశామన్న సంతృప్తిని ఆడియన్స్‌ వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను ఎంజాయ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా పతాక సన్నివేశాలు ఓ స్టేడియంలో ఓ మ్యాచ్‌ను చూస్తున్నఅనుభూతికి లోనవుతున్నారు.
మీ నేపథ్యం?
హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను.. నేను రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్లో డీఎప్‌టెక్‌ చేశాను. పతంగ్‌ దర్శకుడిగా నాతొలిచిత్రం

పతంగుల పోటీ నేపథ్యంలో సినిమా తీయడానికి కారణం ఏమిటి?
ఓ సంక్రాంతి రోజు అనిపించింది. మనం ఫారిన్‌ నుంచి తీసుకొచ్చిన రగ్బిలాంటి స్టోరీతో సినిమాలు తీశాం కానీ ఇది మన నేటివిటి స్పోర్ట్స్‌ కదా.. దీని మీద మనం ఎందుకు తీయలేము అని పతంగ్‌ను మొదలుపెట్టాం. సినిమా మొదలు పెట్టిన తరువాత ఎందుకు తీయలేదో అనే విషయం సీజీ వర్క్‌ అప్పుడు తెలిసింది. సీజీ వర్క్‌కు చాలా సమయం పట్టింది.

సినిమా విడుదలకు ఆలస్యం కావడానికి కారణం ఏమిటి?
సీజీ వర్క్‌కు రెండు సంవత్సరాలు పట్టింది. చాలా కఫ్టమైంది. సినిమా లేట్‌ అవ్వడానికి పతాక సన్నివేశాల్లో వచ్చే సీజీ వర్కే డిలే కారణం. ఎటువంటి రిఫరెన్స్‌ లేకపోవడంతో సీజీకి చాల సమయం తీసుకున్నాం. కైట్‌ ఎగిరేది వర్జినల్‌గా అనిపించేలా వచ్చే వరకు ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు.

మూడు సంవత్సరాల సమయంలో నిర్మాతల సపోర్ట్‌ మీకు ఎలా ఉంది?
ఈ సినిమాకు బిగ్గెస్ట్‌ ప్లస్‌ మా నిర్మాతలే నేను ఎక్కడైనా రాజీపడ్డ వాళ్లు మాత్రం రాజీపడలేదు. ఎంతో ఖర్చు పెట్టి ఈ సినిమాను క్వాలిటీగా నిర్మించారు. ఈ రోజు సినిమా ఇంత రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపించడానికి వాళ్లు పెట్టిన ఖర్చే కారణం.

సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి సపోర్ట్‌ లభిస్తుంది?
సినీ పరిశ్రమలో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో అభినందిస్తున్నారు. ముఖ్యంగా ఎస్‌కేఎన్‌,సందీప్‌కిషన్‌,బెల్లంకొండ సురేష్‌, దిల్‌ రాజులు ఎంతో మెచ్చుకున్నారు.

ఈ కిస్మస్‌ సీజన్‌లో విడుదల కావడంతో మీకు సరైన థియేటర్లు దొరకలేదు అంటున్నారు?
థియేటర్లు ట్రై చేస్తున్నాం. సినిమా తీయడంతో ఇక అయిపోయింది అనుకునేవాడ్ని.కానీ సినిమా తీసిన తరువాత మళ్లీ ప్రమోషన్‌,రిలీజ్‌ ఇంత పని ఉంటుందా అని నాకు ఈసినిమాతోనే తెలిసింది. మౌత్‌టాక్‌తో సినిమా బాగుంది అని తెలిసినా సరైన థియేటర్లు , టైమింగ్స్‌ లేకపోవడంతో సినిమా బాగున్నా జనాలకు అందుబాటులో లేకపోవడవం తో చూడలేకపోతున్నారు. అయితే సినిమా ఆడుతున్న థియేటర్లుమాత్రం ఫుల్‌ అవుతున్నాయి.

దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించారు? ఆ ఐడియా ఎవరిది?
స్క్రిప్ట్‌లో అనుకున్న ప్రకారం ఆ పాత్రకు మొదట సందీప్‌ రెడ్డి వంగా, దిల్‌రాజు, ఎస్‌జే సూర్య నాగ్‌ అశ్విన్‌, ఇలా ఎక్స్‌పెక్ట్‌ చేయని వాళ్లను అడిగాం. కానీ వర్కింగ్ డేస్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఒప్పుకోలేదు. ఇక సినిమాలో గౌతమ్‌ మీనన్‌ పాత్రనున గౌతమ్‌మీనన్‌ చేస్తే బాగుంటుందని అయన్ని ఆప్రోచ్‌ అయ్యాం. ఆయనపాత్ర కథ,విని ఒప్పుకున్నారు. ఆయన మీద పంచ్‌లు వేయడం కూడా బాగా నచ్చింది.

థియేటర్లు మీ సినిమాకు దొరకకపోవడం బాధగా ఉందా?
మొదటిరోజు బాధపడ్డాను. స్లోగా టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది.సినీ పరిశ్రమ నుంచి ఎక్కువ సపోర్ట్‌ వస్తుంది.

పతంగ్‌ జర్నీలో మీరు తెలుసుకున్నది ఏమిటి?
మూడు సంవత్సరాల జర్నీలో చాలా నేర్చుకున్నాను. సినిమా తీయ్యడం కంటే మార్కెటింగ్‌ చాలా ముఖ్యమని తెలిసింది.

ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లడానికి ముఖ్య కారణం ఎవరు?
నాని బండ్రెడ్డి ఈ సినిమాకు మొదలు కావడానికి కారణం. మిగతా వాళ్లంతా నాని తీసుకొచ్చిన ప్రొడ్యూసర్‌. ఆయన సలహాలు,సూచనలు, ఆయన పెట్టిన ఎఫర్ట్‌ చెప్పడానికి మాటల్లేవు.

ఈ సినిమా కొత్తవాళ్లతో చేయడానికి కారణం?
కథకు తగ్గట్టుగా కొత్తవాళ్లతోనే అనుకున్నాం. కథ, మాటలు అన్నీ నేను రాసుకున్నాను.

జనవరి 1న ఓవర్‌సీస్‌లో ఎలాంటి విడుదల ఉండబోతుంది?
ఓవర్‌సీస్‌ జనవరి 1న చాలా వైడ్‌గా రిలీజ్‌గా చేయ్యబోతున్నాం. అక్కడి ఆడియన్స్‌ కూడా ఇంకా బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను.

పర్సనల్‌గా మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం?
ఎంటర్‌టైనింగ్‌ జోన్‌లో కమర్షియల్‌ సినిమాలు చాలా ఇష్టం.పతంగ్‌లో కామెడీకి టెన్ టైమ్స్ నా తదుపరి సినిమాలో ఉంటుంది.

మీ టేకింగ్‌ను చాలా మంది శేఖర్‌ కమ్ములతో పోల్చుతున్నారు?
అవునండి.. నా మిత్రులు కూడా అందే అంటున్నారు. ఓ గొప్ప దర్శకుడితో పోల్చడం నాకు కూడా హ్యపీనే

ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర ఎంతో కన్‌ఫ్యూజ్‌గా క్లారిటీ లేకుండా ఉంటుంది? ఈ పాత్రకు ఎవరైనా ఇన్‌స్పిరేషన్‌ ఉన్నారా?

అది నా క్యారెక్టరే… నాకు కూడా చాలా కన్‌ఫ్యూజన్‌ ఉంటుంది. రెగ్యులర్‌ కూడా నేను అలాంటి వాళ్లను చాలామందిని చూశాను. నేను వర్క్‌ విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉన్నా మిగతా విషయాల్లో కన్‌ఫ్యూజ్‌ అవుతుంటాను.