Skip to content

ఏపీ, తెలంగాణలో రెండు రోజుల్లో 4.04 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను దక్కించుకున్న కల్ట్ మూవీ “రాజు వెడ్స్ రాంబాయి”

అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు 4.04 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. నైజాం ఏరియాలో బాక్సాఫీస్ వద్ద డామినేషన్ చూపిస్తోందీ మూవీ. నైజాంలో డే 1 కు రెట్టింపు వసూళ్లను డే2 రాబట్టింది “రాజు వెడ్స్ రాంబాయి”. తొలి రోజు కోటి రూపాయల గ్రాస్ ఈ సినిమాకు కలెక్ట్ కాగా, రెండో రోజు 2 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఈ రెండు రోజుల్లో కేవలం నైజాంలోనే 3 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను దక్కించుకుందీ మూవీ. కంటెంట్ ఉన్నవి చిన్న చిత్రాలైనా విజయానికి తిరుగుండదని “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా ప్రూవ్ చేస్తోంది.

“రాజు వెడ్స్ రాంబాయి” చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు.

నటీనటులు – అఖిల్ రాజ్, తేజస్వినీ రావ్, శివాజి రాజా, చైతు జొన్నలగడ్డ, అనిత చౌదరి, కవిత శ్రీరంగం, తదితరులు

టెక్నికల్ టీమ్
————————
కాస్ట్యూమ్ డిజైనర్స్ – ప్రియాంక వీరబోయిన, ఆర్తి విన్నకోట
సౌండ్ డిజైన్ – ప్రదీప్.జి.
పబ్లిసిటీ డిజైనర్ – ధని ఏలే
ప్రొడక్షన్ డిజైన్ – గాంధీ నడికుడికర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ధన గోపి
సినిమాటోగ్రఫీ – వాజిద్ బేగ్
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
ఎడిటింగ్ – నరేష్ అడుపా
కో ప్రొడ్యూసర్స్ – ఢోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్
ప్రొడ్యూసర్స్ – వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి
రచన, డైరెక్షన్ – సాయిలు కంపాటి
ప్రొడక్షన్ – ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్
థియేట్రికల్ రిలీజ్ – వంశీ నందిపాటి(వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్), బన్నీ వాస్ (బన్నీవాస్ వర్క్స్)
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)