ఘనంగా MB50 వేడుకలు
ప్రముఖ నటుడు, నిర్మాత, పద్మ శ్రీ డాక్టర్ ఎం. మోహన్ బాబు తన 50 ఏళ్ల సినీ ప్రయాణానికి సంబంధించిన కార్యక్రమంలో భారతీయ సినిమా, రాజకీయ ప్రముఖుల్ని ఒకే వేదికపైకి తీసుకు వచ్చారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో జరిగిన ఈ వేడుకలో తారలంతా సందడి చేశారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, దిగ్గజ వ్యాపారవేత్తలు, సన్నిహితుల సమక్షంలో MB50 వేడుకలు ఘనంగా జరిగాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ తో మోహన్ బాబుకు గత దశాబ్దాలుగా ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. ఆ ప్రేమకు, స్నేహానికి చిహ్నంగా MB50 వేడుకల్లో రజినీకాంత్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు,…
