‘మదరాసి’ బిగ్ స్క్రీన్ పై సెలబ్రేట్ చేసుకునేలా ఉoటుంది: హీరో శివకార్తికేయన్
శివకార్తికేయన్ హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మదరాసి'. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ఫస్ట్ టైం ఎ.ఆర్. మురుగదాస్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? -మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు లాంటి పెద్ద స్టార్స్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మురుగదాస్ గారు. చాలా కూల్ గా ఉంటారు. చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా…
