విధాత తొలి కాపీ సిద్ధం
Abc ప్రొడక్షన్ పతాకం పై భాస్కర్, కోటేశ్వర రావు, ప్రధాన పాత్రదారులుగా మణికంఠ రాజేంద్ర బాబు దర్శకత్వం లో అప్పిని పల్లె భాస్కర చారి నిర్మించిన చిత్రం విధాత. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తొలి కాపీ తో సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత భాస్కరాచారి మాట్లాడుతూ "ఇది ఒక వైవిధ్య భరిత మైన చిత్రం. ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందించడం జరిగింది. ఈ చిత్రంలో పాత్రలన్నీ చాలా సహజ సిద్ధంగా ఉంటాయి. సంగీత పరంగా కూడా మా చిత్రానికి మంచి మార్కులు ప్రేక్షకులు వేస్తారని ఆశిస్తున్నాను. ఈ చిత్రాన్ని అతి త్వరలో మీ ముందుకు తీసుకురానున్నాము…
