‘ఓం శాంతి శాంతి శాంతిః’ కాన్సెప్ట్ వీడియో రిలీజ్
ఇప్పటికే పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్న తరుణ్ భాస్కర్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తోంది. రూరల్ ఎంటర్ టైనర్ గా రాబోతునన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఎ ఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్నారు. సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు నిర్మిస్తున్నారు. కిషోర్ జలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ జాయింట్ ప్రొడక్షన్. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. 2D యానిమేషన్ స్టయిల్ లో ప్రజెంట్ చేసిన కాన్సెప్ట్ వీడియోతో పాటు ఆకట్టుకునే టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో మేకర్స్ ప్రమోషన్‌లను…