‘హైకూ’ షూటింగ్ స్టార్ట్.. సినిమాను సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్
ప్రపంచ స్థాయి ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన నెట్ఫ్లిక్స్.. డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, సిరీస్లు రూపొందిస్తూ.. మరోవైపు భారీ కథలు, బడ్జెట్ ఉన్న స్టార్ హీరోల సినిమాల హక్కులను కూడా సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో ఏగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హైకూ’ సినిమా కూడా చేరినట్లు నిర్మాతలు సగర్వంగా వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తికాక ముందే డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. సాధారణంగా థియేట్రికల్ రన్ చూసిన తర్వాతే ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కోసం ప్రయత్నిస్తాయి. కానీ ‘హైకూ’ సినిమా విడుదలకు ముందే డిజిటల్ డీల్ క్లియర్ కావడం పెద్ద విషయం. ఈరోజు ఉదయం (ఫిబ్రవరి 1) షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. తమిళ…
