మెహిదీపట్నం శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు
మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ మాసం బోనాల పండుగ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ఉట్టిపడేలా చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రత్యేకంగా పసుపు, కుంకుమ బొట్లు, వేపమండలతో అలంకరించిన మట్టి కుండలను విద్యార్థినులు తలపైకి ఎత్తుకుని సందడి చేశారు. విద్యార్థుల పోతుల రాజు, శివ సత్తుల వేషధారణ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీచైతన్య పాఠశాలల మెహిదీపట్నం జోన్ ఏజీఎం కృష్ణ, ప్రిన్సిపల్ ఎన్.స్వాతి కలసి బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. ఈ వేడుకల్లో మెహిదీపట్నం శ్రీ చైతన్య పాఠశాల డీన్ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్ పద్మా పల్లవి, ప్రీ…
