మెహిదీపట్నం శ్రీచైతన్య పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో బుధవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్ ఏజీఎం కృష్ణ, ఆర్‌ఐ, ప్రిన్సిపల్ ఎన్. స్వాతి.. క్రిస్మస్ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. తోటివారి పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలని, ద్వేషంతో ఉండకూడదని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాంతాక్లాజ్, దేవధూత వేషధారణలతో, నృత్యాలు, నాటికలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో డీన్ మల్లేష్, ప్రైమరీ ఇన్‌చార్జ్ పల్లవి, కోఆర్డినేటర్స్ అఖిల్, జనార్ధన్, ఇన్‌చార్జులు బాలరాజు, ఆంజనేయులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
