ఘనంగా “అహోం” మూవీ ప్రారంభం
వివేక్ మిశ్రా, శృతిక జంటగా నటిస్తున్న సినిమా "అహోం". ఈ చిత్రాన్ని ఈగల్ ఐ స్టూడియో ఇంటర్నేషనల్ బ్యానర్ పై దశరథ్ నిర్మిస్తున్నారు. ప్రసాద్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో సినిమా తెరకెక్కనుంది. నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిథులుగా ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ - డైరెక్టర్ ప్రసాద్ రాజు మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన దర్శకత్వంలో ఈ సినిమా పలు భాషల్లో రూపొందడం సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు సినిమా ఒక్క భాషలో చేస్తే వర్కవుట్ కావడం లేదు. హిందీతో…
