‘ఈషా’ సక్సెస్ మీట్‌లో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి బ్లాక్‌బస్టర్స్ అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై 'ఈషా'అనే హారర్ థ్రిల్లర్‌ను అందించారు. ఈ క్రిస్మస్‌కు విడుదలైన ఈ చిత్రం ఈ క్రిస్మస్ విజేతగా నిలిచింది. అంతేకాదు ఈ చిత్రంతో ఈ మిత్రద్వయం హ్యట్రిక్ విజయాలను అందుకున్నారు. కేఎల్ దామోదర్ ప్రసాద్ సమర్పణలో HVR ప్రొడక్షన్స్ బ్యానర్ మీద పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘ఈషా’. ఈ చిత్రంలో త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. ఈ సినిమాని బన్నీ వాస్, వంశీ నందిపాటి సంయుక్తంగా డిసెంబర్…
