‘మహాకాళి’- అసురుల గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో తొలి చిత్రం హనుమాన్ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఈ యూనివర్స్ లో నెక్స్ట్ ఇంస్టాల్మెంట్ మహాకాళి. దీనిని RKD స్టూడియోస్ బ్యానర్ పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించారు. RK దుగ్గల్ సమర్పిస్తున్నారు. ప్రశాంత్ వర్మ క్రియేటర్, షోరన్నర్‌గా వ్యవహరిస్తుండగా, పూజ అపర్ణ కొల్లూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ఛావాలో ఔరంగజేబు పాత్రను అద్భుతంగా పోషించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ ఖన్నా మహాకాళిలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఆయనకి తెలుగులో తొలి చిత్రం. ఛావా విజయం తర్వాత ఆఫర్లు వెల్లువెత్తినప్పటికీ, కథ బలం, అతని పాత్ర డెప్త్ ద్వారా అక్షయ్ తన తెలుగు రిలీజ్ కోసం మహాకాళిని…
