Skip to content

“వేదవ్యాస్” సినిమా ఘనంగా ప్రారంభం

తెలుగు చిత్ర పరిశ్రమలో హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ఎన్నో ఘన విజయాలను అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా "వేదవ్యాస్" ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో సౌత్ కొరియా నటి జున్ హ్యున్ జీ హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ జున్ హ్యున్ జీని ప్రముఖ నిర్మాత,…

Read more

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

ప్రముఖ నటుడు అలీ ఓ రియాలిటీ షో షూటింగ్‌ కోసం గోవా వెళ్లారు. అలీ షూటింగ్‌కు వచ్చిన సంగతి తెలుసుకున్న గోవా ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా వచ్చి తనను కలవాలని అలీకి చెప్పటంతో అలీ ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిశారు. ఈ సందర్భంగా అలీగురించి తెలుసుకున్న ఆయన అలీతో మాట్లాడుతూ దాదాపు 1260 సినిమాల్లో నటించటం అంటే చాలా పెద్ద విషయం అంటూ అలీని పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే గోవాలో జరిగే గోవా ఫిలిం ఫెస్టివల్‌ (జిఎఫ్‌ఎఫ్‌) కార్యక్రమానికి అతిథిగా రావాలని అలీని కోరటంతో ముఖ్యమంత్రి ప్రమోద్‌తో ఖచ్చితంగా పాల్గొంటానని మాటిచ్చారు. అంటే ఈ ఏడాది జరిగే ఫిలిం ఫెస్టివల్‌ వేడుకల్లో అలీ పాల్గొంటున్నారన్నమాట.

Read more

రంగ రంగ వైభవంగా కళామందిర్ 17వ వార్షికోత్సవ వేడుక

కళామందిర్ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవాలను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా హైదరాబాదులో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుక రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులు, వ్యాపార నిపుణులు, సామాజిక సేవకర్తలు, కళామందిర్ ఫౌండేషన్ నిర్వాకులతో కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకలో సినీ నటుడు కమెడియన్ అలీ మాట్లాడుతూ.. మనం ఎంతకాలం బతకామని కాదు, ఎంత సేవ చేసాము అనేదే ముఖ్యం అలాగే కళామందిర్ బ్రదర్స్ కూడా ఎన్ని బ్రాంచీలు పెట్టామని కాదు, ఎంతమందికి సేవ చేసాము అనేదే వారికి ముఖ్యమన్నారు. ప్రతి సంవత్సరం కళామందిర్ వార్షికోత్సవ వేడుకను ఎంతో బ్రహ్మాండంగా చేస్తూ.. ఎంతోమంది దివ్యాంగులకు సేవ చేస్తారు. ఆర్థిక సాయం చేస్తారు అందుకేనేమో కళామందిర్ ఇలా వెలిగిపోతుంది అని అన్నారు…

Read more