‘ఆల్ఫా’ జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదల
ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆలియా భట్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆల్ఫా’. భారీ అంచనాలతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ సినిమాను జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. వైఆర్ఎఫ్ బ్యానర్, అలియా, శర్వరి ఈ కొత్త అప్‌డేట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో ఆలియా భట్ కొత్త యాక్షన్ లుక్ కనిపిస్తోంది. పోస్టర్‌లో ఆమె ముఖం మీద గాయాలు, గాట్లు కనిపిస్తున్నాయి. పోస్టర్ చూస్తుంటే ఇప్పుడే జరిగిన రక్తపాతంతో కూడిన యాక్షన్ జరిగినట్లు చూపించారు.” ‘ఆల్ఫా’సినిమాలో ఆలియా భట్‌తో పాటు హిందీ సినీ…
