రోషన్ తో సినిమా చేయనున్న నిర్మాత అల్లు అరవింద్
‘చాంపియన్’ బ్లాక్‌బస్టర్ విజయంతో యంగ్ హీరో రోషన్ కెరీర్ కీలక మలుపు తిరిగింది. స్వప్న సినిమాస్ సంస్థ భారీ స్థాయిలో నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా భారీ అంచనాలతో విడుదలై, అంచనాలకి మించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ముఖ్యంగా మైఖేల్ పాత్రలో రోషన్ చూపించిన ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్, స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా గీతా ఆర్ట్స్ అధినేత, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గారు ‘చాంపియన్’ చిత్రాన్ని వీక్షించి, రోషన్ నటనకు ఎంతగానో ముగ్ధులయ్యారు. ఆయన వ్యక్తిగతంగా రోషన్‌ను అభినందించడమే కాకుండా, తన బ్యానర్‌లో రోషన్ తో ఒక ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇది రోషన్ కెరీర్‌లో ఒక మైలురాయి కానుంది…
